Rahul Gandhi’s scathing jibe at PM Modi మోడీ మరో పుస్తకంలో అ వివరాలు: రాహుల్ ఎద్దేవా

Rahul jibe at pm modi exam warriors 2 will focus on destroyed careers

Rahul Gandhi, rahul gandhi twitter, Prime Minister Narendra Modi, Exam Warriors, CBSE, Question papers leaked, Prakash javdekar, central board of secondary education, cbse exam, class 12, class 12 re exam, class 10 re exam, test, rahul gandhi, narendra modi, ministry of hrd, latest news

In a big jibe over CBSE examination paper leaks, Congress president Rahul Gandhi said that PM Modi next book will focus on 'students & parents stress relief' after their careers are destroyed by leaked exam papers.

మోడీ మరో పుస్తకంలో అ వివరాలు: రాహుల్ ఎద్దేవా

Posted: 03/30/2018 05:00 PM IST
Rahul jibe at pm modi exam warriors 2 will focus on destroyed careers

‘ఎన్ని లీకులు? డేటా లీక్‌! ఆధార్‌ లీక్‌! ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ పేపర్ లీక్‌! ఎన్నికల తేదీ లీక్‌! సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్‌ లీక్‌! అన్నింటా లీక్‌... చౌకీదార్‌ వీక్‌’ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీకి అధినేత రాహుల్‌ గాంధీ వ్యంగోక్తులు విసురుతూ చేసిన ట్వీట్‌ నెట్టింట్ల సంచలనంగా మారిన తరుణంలో.. ఇవాళ ఆయన మరోమారు ట్వీట్ చేశారు. సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాలు లీకేజీపై ఇవాళ ట్విటర్ వేదికగా ఆయన విమర్శలు సంధించారు. ప్రధాని మోడీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని టార్గెట్ చేశారు. తనదైన శైలిలో మోడీని తన చతురతతో గురిపెట్టారు.

పరీక్షల సమయంలో విద్యార్ధులు ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పేందుకు ప్రధాని ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే. అయితే చౌకీదార్ అంటూ నిన్న విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. ఇవాళ ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలను గుప్పించారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ‘ఎగ్జామ్ వారియర్స్’ బోధించిందనీ... ‘‘ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంగా తమ జీవితాలు నాశనమైనప్పుడు’’ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎలా తట్టుకోవాలో ప్రధాని రాసే రెండో పుస్తకం చెబుతుందని రాహుల్ ఎద్దేవా చేశారు.
 
ఆయన ట్వీట్ తెలుగు అనువాదంతో ఇలా సాగింది.. ‘‘పరీక్షల సమయంలో విద్యార్ధులు ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పేందుకు ప్రధాని ‘ఎగ్జామ్ వారియర్స్’ రాశారు. తరవాత వచ్చేది: ‘ఎగ్జామ్ వారియర్స్-2’... ప్రశ్నాపత్రాల లీక్ కారణంగా తమ జీవితాలు చితికిపోయాక విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆ ఒత్తిడి నుంచి ఎలా రిలాక్స్ అవ్వాలో ఈ పుస్తకం చెబుతుంది...’’ అని ట్వీట్ చేశారు. కాగా సీబీఎస్ఈ ప్రశ్నా పత్రాలు అక్రమంగా బయటికి వస్తే లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తు, ఆకాంక్షలు నాశనమవుతాయని పేర్కొన్న రాహుల్.. కాంగ్రెస్ నిత్యం విద్యాసంస్థలను కాపాడుతూ వచ్చిందనీ... ఆరెస్సెస్, బీజేపీలు విద్యాసంస్థలను పాడుచేస్తే జరిగే పరిణమాలు ఇలానే ఉంటాయంటూ ఆయన ధ్వజమెత్తారు.

PM wrote Exam Warriors, a book to teach students stress relief during exams.

Next up: Exam Warriors 2, a book to teach students & parents stress relief, once their lives are destroyed due to leaked exam papers. pic.twitter.com/YmSiY0w46b

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles