SBI Processing Fee Waiver Till March 31 గృహరుణాలపై బ్యాం‘కింగ్’ వన్డే ఆఫర్

Sbi to waive off processing fees on home loans till march 31

Home loans, SBI, state bank of india, home loans India, Interest rate, repo rate, banks, government, March 31, cheap interest rate, cheap home loans, women borrowers

State Bank of India has decided to waive off the processing fees for home loans till March 31, 2018. Customers who want to apply for SBI home loans can apply by logging into their website, homeloans.sbi. or by visiting a nearby branch.

ఎస్బీఐ గుడ్ న్యూస్: గృహరుణాలపై బ్యాం‘కింగ్’ వన్డే ఆఫర్

Posted: 03/30/2018 03:38 PM IST
Sbi to waive off processing fees on home loans till march 31

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాం‘కింగ్’ సంస్థగా అవతరించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకునే ఖాతాదారులకు రేపటి వరకు తమకు ధరఖాస్తు చేసుకన్న తరుణంలో వారికి బంఫర్ అఫర్ ప్రకటించింది. అంటే ఇది పూర్తిగా వన్డే బంఫర్ ఆఫర్ అన్నమాట. అదెలా అంటే.. మార్చి 31 (రేపటి) వరకు గృహ రుణాల కోసం ఎస్బీఐ వారికి దరఖాస్తు చేసుకన్న వారికి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండానే రుణాలను మంజూరు చేయనుంది. అంటే రేపుటిలోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ రద్దు చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

‘ఎస్‌బీఐ గృహ రుణాలపై మార్చి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేశాం. అంతేగాక.. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు కూడా ఉన్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని కోల్పోవద్దు’ అని ట్విటర్‌లో పేర్కొంది. ఎస్బీఐలో రూ. 30లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే వేతన జీవులకు రూ. 8.4శాతం వడ్డీరేటు పడుతుంది. ఇదే ఉద్యోగం చేసే మహిళలకైతే 8.35శాతం మాత్రమే. ఇక వేతన జీవులు కాకపోతే మహిళలకు 8.45శాతం, పురుషులకు 8.5శాతం వడ్డీరేటు ఉంటుంది. కాగా.. మార్చి 31 ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది ఎస్బీఐ.

ఇక రూ.30 లక్షల నుంచి రూ. 75 లక్షల లోపు రుణాలు తీసుకునే వారికి మరో విధంగా వడ్డీ రేట్లు వున్నాయి. వేతన జీవులకు 8.55 నుంచి 8.6 వరకు వడ్డీ పడుతుండగా, మహిళా ఉద్యోగులకైతే 8.5 నుంచి 8.55 వరకు పడనుంది. అదే వేతన జీవులు కాని పక్షంలో 8.7 నుంచి 8.75 వరకు అదే మహిళా వ్యాపారులైతే..  8.65 నుంచి 8.7 వరకు వార్షిక వడ్డీ పడుతుందని ఇక అంతకు మించిన మొత్తాన్ని రుణాలుగా పొందేవారికి వ్డడీరేట్లు వేరుగా వున్నాయని తెలిపింది. మరోవైపు ఎస్బీఐలో విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల పాస్ బుక్ లు, చెక్ లు కూడా రేపటి వరకే పనిచేస్తాయని ఎస్బీఐ మరోసారి స్పష్టంచేసింది. కొత్త చెక్ బుక్ ల కోసం రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles