Modi will destroy nation says Amit Shah's translator దేశాన్ని నాశనం చేస్తున్న ప్రధాని మోడీ

Modi will destroy nation amit shah s translator goofs up at karnataka rally

Amit Shah, BJP, Prahlad Joshi, Karnataka, Bhartiya Janata Party (BJP), Narendra Modi, Dalit, Poor, goofs up, siddaramaiah, yeddurappa, corruption, survey, politics

Bharatiya Janata Party (BJP) Chief Amit Shah was once again caught in a fix on Thursday after a goof-up by a translator during a campaign rally in Karnataka.

కర్ణాటకలోనే అమిత్ షాకు ఎందుకిలా అవుతుంది..? ప్రధానిపై వ్యాఖ్యలా..?

Posted: 03/30/2018 11:24 AM IST
Modi will destroy nation amit shah s translator goofs up at karnataka rally

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల తమ ప్రీ ఫోల్ సర్వేను బహిరంగపర్చిన ఓ ప్రైవేటు సంస్థ.. గతంలో కన్నా కాంగ్రెస్ ఈ సారి మెరుగైన ఫలితాలను అందుకుని మరోమారు అధికారంలోకి వస్తుందని వెల్లడించిన నేపథ్యంలో.. లేక తాము ఎంత ప్రచారం చేసినా.. ప్రజలు తమ వైపు అకర్షితులు కావడం లేదన్న అక్కస్సో కానీ.. మొత్తానికి బీజేపికి మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన నోరు జారీ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఎవరిదైనా వుందా.? అని ప్రశ్నిస్తే.. అది కేవలం యడ్యూరప్ప ప్రభుత్వమేనని ఓ న్యాయమూర్తి తనతో అన్నారని వ్యాఖ్యలు చేసి.. నాలుక కర్చుకున్నారు.

సరిగ్గా ఇది జరగి వారం రోజులు కూడా తిరిగీ తిరక్కముందే.. తమ అధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించి.. దక్షిణాదిలో కూడా మళ్లీ పాగా వేయాలని అశిస్తున్న బీజేపి వరుసగా చేధు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమిత్ షా తరువాత ఆ పార్టీ ఎంపీ ప్రహల్లాద్ జోషి కూడా ఇదే విధంగా నాలుక కర్చుకున్నారు. అయితే అవి తన మాటలుగా కాకుండా.. పార్టీ అధక్షుడు అమిత్ షా వ్యాఖ్యలుగా అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చేశాడు. అదెలా అంటారా..? అయన ఇటీవల జరిగిన ర్యాలీలో అమిత్ షాకు అనువాదకుడిగా వున్నారు. అమిత్ షా హిందీలో మాట్లాడుతుండగా, దానిని కన్నడలో జోషి అనువదించారు.

దేవనగిరి జిల్లా చల్లకెరెలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనువదిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు. దేశాన్ని ఆయన నాశనం చేయడం ఖాయం.. దయచేసి ఆయనకు ఓటు వేయండి’’ అని పేర్కొనడంతో షా సహా బీజేపీ నేతలు, ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి షా మాట్లాడుతూ.. ‘‘సిద్ధ రామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మోదీపై మీకున్న అభిమానాన్ని యాడ్యురప్పకు ఓటేయడం ద్వారా చూపించండి. కర్ణాటకను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మారుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అనువాదకుడి పొరపాటుతో ప్రజలు విస్తుపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Prahlad Joshi  BJP  Congress  PM Modi  siddaramaiah  yeddurappa  corruption  survey  Karnataka  politics  

Other Articles