Rahul targets PM Modi over too many leaks చతురత, వ్యంగ్యం కలిసిన రాహుల్ ట్వీట్.. ట్రెండింగ్

Leak after leak chowkidar is weak rahul s latest jibe at modi

Rahul Gandhi CBSC paper leak tweet, Rahul Gandhi trolls Modi, Rahul Gandhi Chowkidar tweet, Rahul Gandhi, CBSE exam paper leak, Congress, RSS, BJP, CBSE, Delhi Police, karnataka Assembly Elections, chowkidar, PM Modi, politics

Rahul Gandhi has cracked a bit of an allusive joke at PM Modi's expense today. Counting down the recent scandals of all from Aadhaar data leak, Karnataka election dates leak, to the latest CBSE paper leak, Rahul Gandhi wrote in hindi that the "Chowkidar" is "weak".

చతురత, వ్యంగ్యం కలిసిన రాహుల్ ట్వీట్.. ట్రెండింగ్

Posted: 03/29/2018 04:12 PM IST
Leak after leak chowkidar is weak rahul s latest jibe at modi

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వూంటూ.. తన సోంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి దేశ ప్రధాని అభ్యర్థిగా, ఆ తరువాత ప్రధాని బాద్యతలు చేపట్టడానికి దోహపడిన సోషల్ మీడియాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఐదేళ్ల క్రితం తనను చిన్నపిల్లాడి తరహాలో అభివర్ణించిన బీజేపికి ముచ్చమటలు పట్టిస్తున్నాడు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై ఓ వైపు తీవ్ర విమర్శలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుతు తప్పుడు విధానాలపై విమర్శలు సంధిస్తూనే వున్నారు.

ఫేస్‌ బుక్‌ డేటా దుర్వినియోగం, సీబీఎస్‌ఈ ప్రశ్న పత్రాల లీకేజీ, ఆధార్ డేటా, నమో యాప్ డాటా లీక్ పై అనుమానాల నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా ఆయన కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీని మరోమారు లక్ష్యంగా చేసుకుని చతురతలో విమర్శలు చేశారు. తాను దేశానికి ప్రధానిగా భావించడం లేదని, దేశ ప్రజల తరపున.. దేశప్రజల రక్షణ కోసం వారికి పెద్ద చౌకీదారుగా (కాపలాదారుగా) ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ రాహుల్ గాంధీ తాజా ట్విట్ చేశారు.

దేశంలో ముందెన్నడూ లేని విధంగా లీకులు రాజ్యం నడుస్తుందన్న అభిమతాన్ని వ్యక్తం చేసిన ఆయన.. దానినే టార్గెట్ గా చేసుకుని ప్రశ్నించారు. ‘ఎన్ని లీకులు? డేటా లీక్‌! ఆధార్‌ లీక్‌! ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ పేపర్ లీక్‌! ఎన్నికల తేదీ లీక్‌! సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్‌ లీక్‌! అన్నింటా లీక్‌... చౌకీదార్‌ వీక్‌’ అంటూ హిందీ, ఇంగ్లీష్‌ లలో రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దీనికి #BasEkAurSaal (అధికారంలో ఉండేది ఇంకా ఒక్క సంవత్సరమే అనే అర్థం వచ్చేలా) అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను జోడించారు. అంటే దేశంలో ఇన్ని లీకులు జరుగుతున్నా కాపాలాదారుగా వున్న ప్రధాని మాత్రం వీక్ గా వున్నారని అర్థం వచ్చేలా ఆయన ట్విట్ చేయడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

कितने लीक?

डेटा लीक !
आधार लीक !
SSC Exam लीक !
Election Date लीक !
CBSE पेपर्स लीक !

हर चीज में लीक है
चौकीदार वीक है#BasEkAurSaal

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles