Prakash Raj with CM KCR at Telangana Assembly? నటుడు ప్రకాష్ రాజ్ తో సీఎం కేసీఆర్ భేటీ.. ఆంతర్యమేంటీ.?

Cm kcr had lunch with actor prakash raj at pragathi bhavan

Telangana, CM, KCR, TRS, Actor, Prakash Raj, #JustAsking, BJP, Gauri Lankesh, banglore, karnataka Assembly Elections, politics

Actor Prakash met CM KCR at Pragathi Bhavan in Hyderabad and then travelled with him to Telangana Assembly as well. This versatile actor is creating ripples on social media using #JustAsking hashtag and firing an array of strong counters to ruling BJP.

నటుడు ప్రకాష్ రాజ్ తో సీఎం కేసీఆర్ భేటీ.. ఆంతర్యమేంటీ.?

Posted: 03/29/2018 03:10 PM IST
Cm kcr had lunch with actor prakash raj at pragathi bhavan

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారి.. కేంద్రంలోని అధికార బీజేపిని కేవలం అడుగుతున్నా.. (జస్ట్ అస్కింగ్) పేరుతో ఇరుకున పెడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి అసెంబ్లీకి రావడంలో అంతర్యమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, అయితే కేవలం జాతీయతా భావం వారికి మాత్రమే సొంతమైనట్లు, హిందుత్వం కూడా తమ సొంతమే అన్నట్లు వాదిస్తూ.. దేశంలో మతాల మధ్యన అనిశ్చిత వాతావారణాన్ని తీసుకువచ్చిన బీజేపిని మాత్రం కర్ణాటకలో అధికారంలోకి రానీవ్వబోనని చెప్పిన ప్రకాష్ రాజ్ తో సీఎం కేసీఆర్ అంత ప్రత్యేకంగా చర్చించడానికి గల కారణాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది.

ప్రగతి భవన్‌లో కేసీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి భోజనం చేశారు. ఈ భేటీ వెనుక రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ పై సీఎం కేసీఆర్ ప్రకాష్ రాజ్ తో చర్చించనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కేసీఆర్ ఏకం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇటీవలే కేసీఆర్ కలిశారు. అయితే ప్రకాష్ రాజ్ సేవలను కూడా తమ ఫెడరల్ ఫ్రంట్ కు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారా..? అన్న విషయాన్ని పక్కనబెడితే.. పలు అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ తాను గతంలో చెప్పినట్లుగా, నువ్వు కోట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్నట్లుగా కేంద్రంలోని అధికార బీజేపీని నిందిస్తూనే.. ఆయన బీజేపికి అనుకూలంగా వ్యవహరిస్తూ పావులు కదుపుతున్నారా..? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్డు విడుదలైన తరువాతి రోజునే ప్రకాష్ రాజ్ తో కేసీఆర్ భేటీ కావడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తన సోదరి, ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM  KCR  TRS  Actor  Prakash Raj  BJP  Gauri Lankesh  banglore  karnataka Assembly Elections  politics  

Other Articles