BJP MP Sees "Bright Future" For Lalu.s Son లాలూ తనయుడిపై బీజేపి ఎంపీ ప్రశంసలు..

Rjd s tejaswi would be major player in next assembly polls says bjp mp sinha

shatrughan sinha, tejaswi yadav, patna sahib lok sabha, rjd, bjp, lalu prasad yadav, Sharad Pawar, Nitish Kumar, Bihar chief Minister, politics

BJP Lawmaker Shatrughan Sinha showered praise on apparent RJD heir Tejaswi Yadav and said he saw a "bright future" for the young leader and he would be a "major player" in the next Assembly polls in Bihar.

లాలూ తనయుడిపై బీజేపి ఎంపీ ప్రశంసలు..

Posted: 03/28/2018 03:38 PM IST
Rjd s tejaswi would be major player in next assembly polls says bjp mp sinha

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో అరెస్టై జైలులో వున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి పరామర్శను ప్రకటించారు బీజేపి ఎంపీ శతృఘ్న సిన్హా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అప్పటి మహాకూటమిని ప్రశంసించి.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలసిన శతృఘ్న సిన్హా.. ఇవాళ లాలూ నివాసానికి వెళ్లి.. మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తేజస్వికి రాజకీయాలలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయాల్లో తేజస్వి పరణితి చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నారు.

తేజస్విని చూస్తుంటే చిన్న వయసులో ఉన్న శరద్ పవార్ గుర్తొస్తున్నారని చెప్పారు. లాలూ నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన ఈ మేరకు కితాబిచ్చారు. రాబోయే ఎన్నికల సమయానికి తేజస్వి మరింత రాటుదేలుతాడని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పోటీ అవుతాడని శతృఘ్న సిన్హా అన్నారు. పిన్న వయస్సులోనే రాజకీయ అటుపోట్లను తట్టుకోవడంతో.. చాణక్య రాజనీతిని అవగతం చేసుకుని మెలగడానికి దోహదం చేస్తుందని అన్నారు. ఆ తరువాత పట్నా ఆసుపత్రిలో ఉన్న లాలూను కూడా ఆయన కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, చాలా రోజుల తర్వాత లాలూను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles