IDBI Bank reports Rs. 772 cr. fraud ఐడీబీఐ బ్యాంకులో భారీ కుంభకోణం.. రూ.772 కోట్లకు కుచ్చుటోపి..

Idbi bank discloses rs 772 crore fraud shares fall 3 5

IDBI Bank, Loan fraud, fish farming businesses, non-existent fish ponds, IDBI shares, IDBI branches, IDBI bank fraud case, Andhra Pradesh branch, Telangana branch, CBI, BSE

IDBI Bank Ltd said on Tuesday that fraudulent loans of Rs772 crore ($118.8 million) were issued from five of its branches in Andhra Pradesh and Telangana,

ఐడీబీఐ బ్యాంకులో భారీ కుంభకోణం.. రూ.772 కోట్లకు కుచ్చుటోపి..

Posted: 03/28/2018 04:37 PM IST
Idbi bank discloses rs 772 crore fraud shares fall 3 5

రాజు గారి చేపల చెరువు సీనిమాను చూశారా..? అచ్చం అలానే కాకపోయినా.. అదే తరహాలో లేని చేపల చెరువులను వున్నట్లు నకిలీ డాక్యమెంట్లు చూపించి.. వీరికి గ్యారంటీగా కొందరు పారిశ్రామిక వేత్తలను కామన్ గ్యారంటర్లుగా పెట్టింటి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, తరువాత ఎస్బీఐ, బాటలోనే ఐడీబిఐ బ్యాంకులు కూడా పయనించాయి. నగల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలో రూ. 13 వేల కోట్ల మేర కాకపోయినా.. తమ స్థాయికి తగట్టుగానే రూ. 772 అసలుకు నష్టపోయింది పబ్లిక్ సెక్టార్ యూనిట్ బ్యాంకు ఇండస్ట్రీయల్ డెవెలంప్ మెంట్ బ్యాంకు అప్ ఇండియా (ఐడీబిఐ).

చేపల చెరువుల వ్యాపారం పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ఐదు బ్యాంకుల్లో రూ. 772 కోట్ల మేర రుణాలను పోందిన పెద్దలు రుణాలను అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోవడంతో.. తాజాగా బ్యాంకు అధికారులు తమ సంస్థాగత విచారణ తరువాత సిబిఐని అశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కుంభకోణం ముంబైలోని ఓ బ్యాంకులోనూ జరిగినా.. వారు రమారమి రుణాన్ని రాబట్టుకోవడంతో.. కేవలం తెలుగు రాష్ట్రాలైన అంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఐడిబిఐ బ్యాంకుల్లో మాత్రమే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని వెల్లడైంది.

2009 నుంచి 2013 వరకు లేని చేపల చెరువులను తాము తీసుకుంటున్నట్లు నకిలీ డ్యాకుమెంట్లను తయారు చేయించి.. వీరందరికీ గ్యారంటీగా కామన్ పారిశ్రామిక వేత్తలు వున్నట్లు కూడా చూపడంతో బ్యాంకు అధికారులు వారికి రుణాలను మంజూరు చేశారు. అడిట్ లో బయటపడిన విషయంతో ఐడీబిఐ అధికారులు సీబీఐని అశ్రయించారు. అయితే కేవలం ఇధ్దరు అధికారుల మాత్రమే వీరందరికీ రుణాలను మంజూరు చేశారని బ్యాంకు అంతర్గత దర్యాప్తులో తేలింది. కాగా వారిలో ఒకర్ని ఉద్యోగం నుంచి తొలగించగా, మరోకరు ఇప్పటికే రిటైరయ్యారు. ఈ కుంభకోణం వివరాలు బయటకు రాగానే ఐడీబీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles