BJP tweets Karnataka poll dates before EC announcement కర్ణాటక ఎన్నికల తేదీల లీక్ వివాదాస్పదం.. మీడియా ఫైర్..

Bjp tweets karnataka poll dates before announcement ec serious

Karnataka Assembly elections, Karnataka elections, Karnataka Election 2018, BJP, Congress, BS Yeddyurappa, Siddaramaiah, Election Commission, Election Commission of India, EC, ECI, Media Question EC, Congress, amit malviya, amit malviya karnataka poll dates, election commission, karnataka election dates, bjp it cell karnataka dates

Even before the Election Commission announced dates of polling and results of the Karnataka Assembly elections 2018, BJP’s IT cell head Amit Malviya tweeted the date of polling and counting.

ఇదేనా బీజేపి నూతన చరితం.. పంజర చిలుకలుగా స్వతంత్ర సంస్థలు..?

Posted: 03/27/2018 03:48 PM IST
Bjp tweets karnataka poll dates before announcement ec serious

ప్రధాని నరేంద్రమోడీ.. ప్రధానిగా బాధ్యతలను చేతబట్టిన తరువాత దేశ పార్లమెంటులోకి అడుగుపెట్టిన తొలి రోజు.. పార్లమెంటు దేవాలయం.. అని వ్యాఖ్యానించి దేశ ప్రజల మన్ననలను మరోమారు అందుకున్నారు. అయితే గత బడ్జెట్ సెషన్ కారణంగా అటు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని పెట్టిన వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఇలా అనేక పార్టీలు వేర్వేరుగా ప్రకటించిన తరువాత కూడా లోక్ సభలో ఆ అంశంపై చర్చ సాగలేదు. బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలు పూర్తిగా గంధరగోళంగా మారాయి. వాయిదాల పర్వాలతో ఉభయసభలు చర్చలకు నోచుకోకుండానే సాగుతున్నాయి.

అయితే అవిశ్వాసం నేపథ్యంలో కేంద్రప్రభుత్వమే ఈ అంశంపై కావాలని డ్రామాలడిస్తుందని విపక్షాల అరోపణల నేపథ్యంలో దేవాలయంలో పూజలు నిర్వహణకు పూజారులే అడ్డుగా నిలుస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇక ప్రజాస్వామ్య దేశం.. ఆ దేశంలోని స్వయం ప్రతిపత్తి కల్గిన సంస్థలు గురించి కూడా ఎంతగానో చెప్పిన ప్రధాని.. ఇప్పుడు తన పార్టీ నేతలతో పాటు తాను కూడా నిబంధనలు అతిక్రమించారన్న వార్తలు ఇప్పటికే వినిపించాయి. ప్రధాని కాకముందే కమలాన్ని తన చేతిలో పట్టుకుని దేశప్రజలకు పార్టీ గుర్తును చూపిస్తూ.. ప్రసంగం చేసి విమర్శల పాలయ్యారు.

ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రధాని నిబంధనలను అతిక్రమించారని విపక్షాలు అరోపణలు చేశాయి. ఇక ఇప్పుడు తాజాగా బీజేపి పార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను వెలువరించక ముందే.. ఫలానా తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఫలానా సమయంలో కౌంటింగ్ చేపట్టనున్నారని ముందుగానే ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సందేహాలకు దారితీసింది. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరుగుతాయని, మే 18న ఫలితాలు వెలువడతాయంటూ ట్వీట్ చేశారు.

ఎన్నికల సంఘం ఇంకా కర్ణాటక ఎన్నికల తేదీలను వెలువరించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహా ఎలక్షన్ కమిషన్ పై విమర్శలకు దిగింది. ‘'బీజేపీ ఒక అద్భుతమైన ఎన్నికల సంఘం'’ అంటూ కాంగ్రెైస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యంగ్యంగా అభివర్ణించింది. కేంద్ర ఎన్నికల సంఘం పంజరంలో చిలుక మాదిరిగా అయ్యిందా అంటూ సందేహాలను వ్యక్తం చేసి.. ఈసీ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు నోటీసులు జారీ చేయాలని, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓం ప్రకాష్ రావత్.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు జరుపుతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly elections  Karnataka  dates leak  BJP  Amit malviya  Congress  Randeep Surjewala  ECI  

Other Articles