Siddaramaiah thanks Amit Shah for trolling Yeddyurappa సెల్స్ గోల్ చేసుకున్న అమిత్ షా.. కాంగ్రెస్ చేతికి ఆయుధం..

Amit shah calls bjp s yeddyurappa most corrupt course corrects

Karnataka, Karnataka election, Karnataka election date, Karnataka Assembly Election 2018, Amit Shah, Amit Shah slip, Karnataka polls, Karnataka politics, what did Amit shah say, Amit Shah truth, Amit shah speech, B S Yeddyurappa, Siddaramaiah, Politics

BJP President Amit Shah evidently suffered a major slip of tongue when he said if there was to be a competition for the most corrupt government in India, the one to top it would be the B S Yeddyurappa government.

ITEMVIDEOS: సెల్స్ గోల్ చేసుకున్న అమిత్ షా.. కాంగ్రెస్ చేతికి ఆయుధం..

Posted: 03/27/2018 04:58 PM IST
Amit shah calls bjp s yeddyurappa most corrupt course corrects

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. తమ ప్రభుత్వమే ఇంకా కర్ణాటకలో సాగుతుందనుకున్నారో లేక, నిజాలను ఇలాగైనా అంగీకరించాలని భావించారో కానీ తమ నేత పాలన ఎలా వుండిందన్న విషయాన్ని చెప్పి.. నాలుక కర్చుకున్నారు. ఆనక అలా కాదు.. ఇలా అని అన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదెలా అంటే ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వస్తుందని, ఈ సారి గతంలో కన్నా మెరుగ్గా స్థానాలను సంపాదించుకుంటుందని ఇప్పటికే సర్వే సంస్థలు వెల్లడించగా, తమ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలన్న అంశంమై బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనమునకలైన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చేలా చేశాయి.

అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ కు తిరుగులేని ఆయుధంగా మారింది. కర్ణాటక ఎన్నికల తేదీల ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపి ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాలవ్యా చేసిన చేసిన ట్విట్ విమర్శలకు దారి తీయగా, ఇక అమిత్ షా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వీట్ న్యూస్ అందించి.. సొంత పార్టీ నేత యడ్యూరప్పకు మాత్రం చేదు గుళికను అందించారు. అదెలా అంటే.. ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వున్న అమిత్ షా.. బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో రాష్ట్రంలోని దావణగెరేలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు.

ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ, ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యెడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. అదే సమయంలో అమిత్ షా పక్కనే యెడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యెడ్డీ కంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో, చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యెడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.

కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. షా మాటలను కాంగ్రెస్ ఆయుధంగా మలుచుకుంది. అమిత్ షా మాటలను క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు... 'ఎట్టకేలకు చివరకు షా నిజాలు మాట్లాడారు' అంటూ సందేశాన్ని కూడా జత చేశారు. అమిత్ షా చేసిన పొరపాటు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది.

The #ShahOfLies finally speaks truth. Thank you @AmitShah pic.twitter.com/WczQdUfw5U

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  B S Yeddyurappa  Siddaramaiah  Assembly Election 2018  Karnataka  Politics  

Other Articles