Logjam continues in parliament, both Houses adjourned మళ్లీ అదే సీన్.. హీరో శివాజీ సమాచారం కూడా తుస్..

Logjam continues in parliament both houses adjourned

parliament, rajya sabha, budget session, venkaiah naidu, lok sabha, sumitra mahajan, no confidence motion, YSRCP, TDP, chandrababu, YS Jagan, andhra pradesh special status, andhra pradesh, politics

Both the Houses of Parliament were adjourned on Friday, the Upper House was adjourned till Monday due to protests by TDP MPs demanding special status for Andhra Pradesh, and the Lok Sabha reconvened at 12 pm but was adjourned soon after because of the protests.

మళ్లీ అదే సీన్.. హీరో శివాజీ సమాచారం కూడా తుస్..

Posted: 03/23/2018 12:51 PM IST
Logjam continues in parliament both houses adjourned

దక్షిణ భారతంతోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపి అపరేషన్ ద్రవిడ ను నడుపుతుందని, అందులో భాగమే అపరేషన్ గరుడ.. ఇది తెలుగు రాష్ట్రాలకు చెందినదని అరోపించిన హీరో శివాజీ.. తనకున్న సమాచారం మేరకు శుక్రవారం రోజున పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరుపుతారని.. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడించి.. జరిగిందనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇవాళైన పార్లమెంటులో చర్చకు వస్తుందా.? అంటే అదీ లేదు. గత ఐదు రోజులుగా రిపీట్ అవుతున్న సీన్ మాత్రమే మళ్లి రిపీటయ్యింది.

ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే కేవలం మూడు నిమిషాల్లో షరామామూలుగా తొలిసారి మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు, టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. వెంటనే తమ స్థానాల్లోంచి లేచి వెల్ లోకి వచ్చిన టీఆర్ఎస్ సఃభ్యులు రిజర్వేషన్లపై అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని డిమాండ్ చేయగా, కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు.

దీంతో గత ఐదు రోజులుగా సాగుతున్నట్లుగానే నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీల ఎంపీలను తమ స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. అవిశ్వాసంపై చర్చకు సహకరించాలని అందోళన చేస్తున్న సభ్యులను పదేపదే కోరారు. అయినా సభలో గందరగోళం ఆగకపోవడంతో... సభ ఆర్డర్ లో లేదని, ఈ పరిస్థితుల్లో చర్చను చేపట్టలేమని చెబుతూ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోని పరిస్థితుల్లో మార్పు కనబడకపోవడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది.

అటు రాజ్యసభలో కూడా అదే సీన్ రీపీట్ అయ్యింది. దీంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు తమతమ సమస్యల పట్ల ఆందోళనలు చేపట్టారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ వెంకయ్య పదేపదే కోరినప్పటికీ సభ్యులు శాంతించలేదు. ఒకానొక సమయంలో వెంకయ్య ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఇలాగే అయితే ఎలా? అంటూ ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ నిరసన కార్యక్రమాలను విపక్ష సభ్యులు కొనసాగించడంతో... సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles