SBI slashes charges on minimum balance in accounts ఎత్తేయమంటే.. తగ్గించి సంతోషపర్చిన ఎస్బీఐ..

Sbi reduces charges on non maintenance of minimum balance

Financial services, Economy, Finance, Banking, Bank deposits, Bank account, Savings account, Bank, Pradhan Mantri Jan Dhan Yojana, Deposit account, Banks - NEC, Savings Bank Deposit, State Bank of India, bank facilities, basic savings bank deposit account (BSBD), average monthly balance (AMB), Retail and Digital Banking, bank, bank account

The State Bank of India today reduced its charges on non-maintenance of an average monthly balance (AMB) in savings account by up to 75 per cent, effective April 1.

ఎత్తేయమంటే.. తగ్గించి సంతోషపర్చిన ఎస్బీఐ..

Posted: 03/13/2018 04:07 PM IST
Sbi reduces charges on non maintenance of minimum balance

కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్తల బకాయిలను ఒక్క కలంపోటుతో రైట్ ఆఫ్ చేసే బ్యాంకులు.. సామాన్యులకు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం చార్జీలపై చార్జీలను వేసి మరీ వసూలు చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ.. సామాన్యుల సేవింగ్స్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేయాలని కూడా వినతులు వెళ్లాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన భారతీయ స్టేట్ బ్యాంకు.. ఖాతాదారుల కోరికను పూర్తిగా అమలు చేయలేదు.

అయితే మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో విధించే చార్జీలను మాత్రం సుమారుగా 70శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 25 కోట్ల మంది ఎస్బీఐ ఖాతాదారులకు ఊరటకలగనుంది. సేవింగ్ ఖాతాల్లో ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ లేని కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జీలను తగ్గించింది. సవరించిన చార్జీలు వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇప్పటి వరకు నెలకు యాభై రూపాయల చొప్పున విధించబడే పెనాల్టీ ఇకపై రూ.15కు పరిమితం కానుంది.
 
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.40 వరకు నాన్ మెయింటెనెన్స్ చార్జీలు విధిస్తున్నారు. ఎస్బీఐ తాజా నిర్ణయంతో రానున్న అర్థిక సంవత్సరం నుంచి సెమీ అర్బన్ కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జి రూ.12, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వరకు చార్జీలు విధించనున్నారు. అయితే ఈ చార్జీలకు యధావిధిగా జీఎస్టీ అదనంగా ఉంటుంది. అటు పారిశ్రామిక వేత్తల రుణాల రైట్ ఆఫ్ తో పాటు ఇటు బ్యాంకు లాభార్జనలో అదాయం కన్నా పెనాల్టీలతో ల ద్వారా వచ్చే ఆదాయం అధికంగా ఉండటం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో ఈ మేరకు దిద్దుబాట్టు చర్యలకు బ్యాంకు యాజమాన్యం దిగింది.

విద్యార్థులు, నిరుపేదలకు చెందిన ఖాతాలను సైతం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలుగా పరిగణించడంతో భారీగా నష్టపోతున్నరని గ్రహించిన బ్యాంకు ఇకపై సామన్యుల తమ ఖాతాలను రెగ్యూలర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎలాంటి చార్జీలు పడని బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఢిపాజిట్ అకౌంట్ కు మార్చుకునే వెసలుబాటు కూడా కల్పించింది. ఎస్బీఐకి మొత్తం 41 కోట్ల సేవింగ్స్ ఖాతాలుండగా.. అందులో 16 కోట్ల వరకు జన్‌థన్ ఖాతాలు, బేసిక్ ఖాతాలే ఉన్నాయి. ఈ ఖాతాలకు కనీస నిల్వల నిబంధన లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  minimum balance  zero balance  minimum charges  State Bank of India  business  economics  finance  

Other Articles