Kodandaram Versus Telangana Police at Tank Bund | ట్యాంక్ బండ్ వద్ద హైటెన్షన్.. కోదండరాం వర్సెస్ పోలీసులు

High tension at tank bund

Million March Spoorthy Sabha, TJAC , Kodandaram, Telangana Police, Million March

Amid Million March Spoorthy Sabha High Tension at Tank Bund. Traffic Diversion implemented ano no one Allow to Hussain Sagar Surroundings. Prof. Kodandaram Discuss the Issue with JAC Leaders.

ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్.. రూట్లు మళ్లింపు

Posted: 03/10/2018 09:16 AM IST
High tension at tank bund

తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చి ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. అయితే అక్కడ జరిగిన విధ్వంసం కూడా దేశ స్థాయిలో అదే చర్చకు దారితీసింది. కట్ చేస్తే.. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు, టీఆర్ఎస్ అధికారంలోకి రావటం, ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే అదే మిలియన్ మార్చి నిర్వహించిన టీజేఏసీ ఇప్పుడు స్పూర్తి సభను నిర్వహించే యత్నం చేస్తోంది.

టాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నేడు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నేడు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అదే ట్యాంక్ బండ్ పై నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించగా, తెలంగాణ పోలీస్ శాఖ అందుకు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. నాడు జరిగిన బీభత్సం మరోసారి జరగవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ట్యాంక్ బండ్ ను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సెక్రటేరియేట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు ఒక్క వాహనాన్నీ వదలడం లేదు.

వాహనాలన్నీ లిబర్టీ చౌరస్తా వైపు మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం 5 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కర్బాలా మైదానం మీదుగా, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను లోయల్ ట్యాంక్ బండ్ మీదుగా మళ్లించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు అక్కడక్కడా ఉన్న మెట్ల మార్గాన్ని ఇనుప కంచెలతో మూసివేశారు. అయినప్పటికీ సభను ఎలా నిర్వహించే విషయంపై వెనక్కి తగ్గని జేఏసీ నేత కోదండరామ్... మరికాసేపట్లో ప్రముఖ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

మళ్లింపు రూట్లు ఇవే...

- సికింద్రాబాద్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలను కార్బల మైదాన్ సమీపం నుంచి షెయిలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్‌రోడ్డు, డీబీఆర్ మిల్స్, కట్టమైసమ్మ, అంబేద్కర్ విగ్రహం,     తెలుగుతల్లి, రవీంధ్రభారతీ రూట్‌లో మళ్లిస్తున్నారు.
- నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను గంగమహాల్-ఇందిరాపార్కు రూట్‌లో మళ్లిస్తారు.
- నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్ వైపు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను మింట్‌కంపౌండ్ లేదా సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌మార్గ్, నెక్లెస్‌రోటరీ, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు,నల్లగుట్ట, సికింద్రాబాద్ రూట్‌లో మళ్లిస్తారు.
- బషీర్‌బాగ్ వైపు నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలు మోర్ మెడికల్ హాల్, బాలాజీ గ్యాండ్‌బజార్, క్రిస్టల్ ఐటీ, తెలుగుతల్లి, ఇక్బాల్‌మినార్ మింట్ కంపౌండ్ లేదా రవీంద్రభారతి మీదుగా         వెళ్లాలి.
- సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్బాలమైదాన్ నుంచి బుద్దభవన్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, నెక్లెస్ రోటరీ, వీవీ విగ్రహం లేదా
  తెలుగుతల్లి వైపు వెళ్లాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles