Indian Railways Allows Transfer Confirm Ticket to Another | రిజర్వేషన్ టికెట్లు మరొకరికి ట్రాన్స్ ఫర్ చెయొచ్చు.. కానీ, షరతులు వర్తిస్తాయి

Confirmed railway ticket transfer to another

Indian Railways, IRCTC, Reservation Ticket, Transfer Facility, Reservation Confirmed Ticket, Railway Ticket Transfer, IRCTC Conditions

IRCTC Train Ticket Transfer allows passengers to transfer their confirmed tickets to other. But, Conditions Applied.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

Posted: 03/10/2018 10:52 AM IST
Confirmed railway ticket transfer to another

భారతీయ రైల్వే శాఖ ప్రయాణిలకు శుభవార్త అందించింది. ట్రెయిన్ టికెట్ క్యాన్సిలేషన్ కష్టాలు తీరుస్తూ కొత్త వెసులు బాటును కల్పించింది. దాని ప్రకారం టికెట్‌ బుక్‌ చేసుకున్న తరువాత క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మరోకరికి బదిలీ చేసే వీలుంది. త్వరలో ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.

అయితే కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. ఒకరి టికెట్ ను మరొకరికి బదిలీ చేసేందుకు రైల్వే శాఖ అనుమతి తప్పని సరి అని పేర్కొంది. టికెట్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమైన స్టేషన్లలోని చీఫ్‌ రిజర్వేషన్‌ పర్యవేక్షకులకు మాత్రమే కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ట్రైన్ బయల్దేరేందుకు 24 గంటల ముందు లిఖిత పూర్వక అనుమతి తీసుకుని టికెట్‌ ను బదిలీ చేయాలని వారికి సూచించింది.

విద్యార్థులకు సంబంధించిన టికెట్‌ ను బదిలీ చేయాలనుకుంటే వారు చదివే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఒక టికెట్‌ ను ఒకసారి మత్రమే బదిలీ చేయాలని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles