harish rao condemns his joining in bjp | తూచ్.. ఉత్తదే.. అలా చేస్తే జైలుకే

Telangana minister harish rao condemns his joining in bjp

Harish rao, Telanagana minister, social media, rumours in social media, arrest, false publicity, Hyderabad police commissioner, congress, mahender reddy, Telanagana, hyderabad police

Telangana minister harish rao condemns the rumours which were trending on social media stating that he is yet to join BJP party with 40 party MLAs, minister says his birth and last breath is also in TRS party

తప్పుడు ప్రచారం చేస్తే.. ఇక కటకటాలే.. హెచ్చరించిన హరీష్

Posted: 03/09/2018 06:53 PM IST
Telangana minister harish rao condemns his joining in bjp

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు పార్టీ స్పందించారు. తన పుట్టుక టీఆర్ఎస్ లోనే... అలాగే తన చావు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇప్పటికే వందసార్తు చెప్పానని, అయినా కొందరు కావాలని తనపై గోబెల్స్ ప్రచారాన్ని చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.

హరీశ్‌రావు విషయంలో ఎవరూ కలలో కూడా ఇలాంటి ఆలోచనగానీ, ఊహించడానికి అవకాశం లేదని అన్నారు. తనపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి ఐపీ అడ్రస్ ల ద్వారా గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని, అలాంటి అబద్ద ప్రచారం చేస్తున్నవారికి ఇకపై జైలులో పెట్టి కటకటాల రుచి చూపించాలని తాను డీజీపీని కోరినట్లు హరీశ్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ మాటే.. తన బాట అని.. ఉద్యమంలో పోరాడిన వాడినని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

త్యాగాలు చేసిన పార్టీలు, రాష్ట్ర సాధనలో భాగంగా జైళ్లకు వెళ్లిన తాము.. పార్టీకి కట్టుబడి వుండే కార్యకర్తలమని చెప్పారు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని... కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 12నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమ ఎజెండా నిర్ణయిస్తామన్నారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన.. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ఇప్పడున్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles