Pawan Slams TDP YCP Over Special Status Agitation | హోదాపై చిల్లర రాజకీయాలు.. నా ఇంటిపై ఐటీ అధికారులను పంపారు : పవన్

Pawan kalyan media chit chat

Janasena Party, Pawan Kalyan, Special Status Agitation, Pawan IT Raids, YSRCP, TDP, Jagan Chandrababu Cases

Janasena Party Chief Pawan Kalyan Slams TDP and YSRCP over AP Special Status Agitation. Pawan Said IT Raids also Conduct at Him. Chandrababu and Jagan fears for Cases Pawan Added.

హోదాపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : పవన్

Posted: 03/07/2018 01:03 PM IST
Pawan kalyan media chit chat

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నేతలపై మండిపడ్డారు. బుధవారం మీడియాతో చిట్ ఛాట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాటం జరట్లేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కేసులకు భయపడుతున్నారన్నారు. 

ఇక థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ అని తాము చెబుతోంది అధికారం కోసం కాదని, రాజకీయాల్లో మార్పు కోసమని చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించడానికి థర్డ్ ఫ్రంట్ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. థర్డ్ ఫ్రంట్‌లో దక్షిణాది నుంచి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని, కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ మేవాని వంటి వారు కూడా కలిసి వస్తారన్నారు.

ప్రత్యేక హోదా కోసం...
తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమం జరగాలని ముందుకు సాగాలన్నారు. ప్రత్యేక హోదాపై బాధ్యతతో వ్యవహరించాల్సిన పార్టీలు చిల్లరగా ప్రవర్తిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనపైకి ఐటీ అధికారులను పంపించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందని, ప్రస్తుతం ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమిస్తున్నాయన్నారు. టీడీపీ, వైసీపీలు రాజకీయ లబ్ధి కోసం తప్ప చిత్తశుద్ధితో పోరాడటం లేదని పవన్‌ అభిప్రాయపడ్డారు.

జేఏసీ అవసరం...
ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాస్థాయి నేతలు అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని చంద్రబాబు ప్రభుత్వం అంటోందని.. కానీ, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పనందుకే నిధులు నిలిపేశామని కేంద్రం అంటోందని చెప్పారు. ఏది నిజమో తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పవన్ మీడియాతో చిట్ ఛాట్ నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles