Chandrababu Statement On Central Funding in Assembly | ఏం ఇచ్చారని లెక్కలు అడుగుతున్నారు? : అసెంబ్లీలో చంద్రబాబు ఆక్షేపణ

Chandrababu naidu on central aid

Andhra Pradesh, CM Chandrababu Naidu, Assembly Session, BJP,

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu Statement on Central Funding in Assembly. Chandrababu Says It is not Correct for BJP to ask Deficit State about Aid.

‘ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు’

Posted: 03/07/2018 03:37 PM IST
Chandrababu naidu on central aid

రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. ఇక‌ రాజధానికి ఇప్ప‌టికి రూ.1500 కోట్లు ఇచ్చారని, వాటికి ఇప్ప‌టికే లెక్కలు పంపామ‌ని తెలిపారు.

విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని ఇక్కడి నుంచి మరోసారి డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని అప్ప‌ట్లో నీతి అయోగ్ సిఫార‌సు చేసింద‌ని చంద్రబాబు అన్నారు. పోల‌వ‌రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో ఇంకా రూ.2,568 కోట్లు రావాల్సి ఉందని, ఆ ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు పెట్టిన వాటిల్లో రూ.4,932 కోట్లకు లెక్కలను పోలవరం అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామ‌ని అన్నారు.

పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసుకోవాలని అన్నారు.

ఇచ్చిందేం లేదు... ఇదిగో లెక్కలు

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని నేరుగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి చెప్పానని... అయినా ఫలితం లేదని అన్నారు. ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13000 కోట్లు ఖర్చయితే... కేంద్ర నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మెత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు.

పోలవరం, అమరావతికి ఇచ్చిన నిధులకు లెక్కలు పంపించామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లు ఇచ్చారని, ఆ లెక్కలు పంపించామని వెల్లడించారు. మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు ఖర్చవుతుందని... ఇప్పటి వరకు కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్ లో పెట్టారని అన్నారు.

ఐఐటీ తిరుపతికి రూ. 100 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 11 జాతీయ విద్యాసంస్థలకు రూ. 11 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చామని... వీటి ఏర్పాటుకు రూ. 11,500 కోట్లు ఖర్చవుతుండగా... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు కుదరదంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామన్న హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. ఏపీలో ఉన్న కొన్ని సంస్థల పన్నులు తెలంగాణకు వెళతున్నాయని... ఈ తప్పులను కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles