ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ నేతలు ఢిల్లీలో చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, నిధుల అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది.
ఇక భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విభజన హామీలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై తాము జైట్లీతో చర్చించామని అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చ జరిగిందని అన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు.
నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉందని, ఆర్థికలోటు భర్తీ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. మరోవైపు టీడీపీ ఎంపీలు మాత్రం ఈ చర్చల తర్వాత కూడా అసంతృప్తిగానే కనిపించటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Feb 26 | చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే తరహాలో ఇంధన ధరలు వుండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వర్తక సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్... Read more
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more