Illicit Relationship UP Man Forcibly Made to Drink Urine | అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ.. మహిళల మూత్రం తాగించబోయారు

Up man punished illicit relation allegations

Uttar Pradesh, Saharanpur, Illegal Relationship, Women Urinate, Forcibly Drink, Suicide Attempt

Man suspected of having illicit relationship thrashed, made to drink urine in Saharanpur Uttar Pradesh. Later man tried to commit suicide but survived by Family Members.

వివాహేతర సంబంధం ఆరోపణలు.. దాష్టీకం

Posted: 03/06/2018 11:35 AM IST
Up man punished illicit relation allegations

వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడి దారుణమైన శిక్ష విధించేందుకు యత్నించగా.. అతగాడు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

స్థానిక ఇందిరా కాలనీకి చెందిన యువకుడు ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ స్థానికులు చితకబాదారు. ఆపై గ్రామ పంచాయతీ పెద్దలు అతడిని దోషిగా తేల్చి బలవంతంగా అక్కడి మహిళల మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకెవరితోనూ వివాహేతర సంబంధాలు లేవన్నాడు. వారు ఆరోపిస్తున్న ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదని, తమ ఇద్దరికి సంబంధం అంటగట్టారని వాపోయాడు. తనను దోషిగా తేల్చి మూత్రం తాగించే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. తనను చంపేస్తారేమోనని భయపడుతున్న యువకుడు ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిపై దాడిచేసినట్టు తమకు సమాచారం అందిందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని షహరాన్‌పూర్ ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles