Man Sexually Harass Serial Actress Lured with Chances | స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ సీరియల్ నటికి వేధింపులు

Actress sexual harassed in hyderabad

Hyderabad, Serial Actress, Movie Chances, Lure, Man, Arrest, Sexual Harassment, Serial Actress Sexual Harassment

Hyderabad Man Sexually Harassed Serial Actress Lured with Movie Chance. Case filed in Banjara Hills Police Station.

సినిమా ఛాన్సు పేరుతో టీవీ నటిపై ...

Posted: 03/05/2018 10:54 AM IST
Actress sexual harassed in hyderabad

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టార్ హీరో సినిమాలో చాన్స్ ఇప్పిస్తానంటూ టీవీ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గచ్చిబౌలిలో నివాసముండే ఒక టీవీ నటికి ఫేస్ బుక్ ద్వారా జగదీశ్ పిచ్చికి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

రవితేజ హీరోగా.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నటికి అవకాశం కల్పిస్తానంటూ జగదీశ్ నమ్మబలికాడు. దాని కోసం మాట్లాడాలని ఆమెను ఓ అడ్రస్ కు ఆహ్వానించాడు. ప్రగతినగర్లోని శ్రీ సాయిరామ్ మానర్ అపార్టుమెంట్‌ లోని 507 ఫ్లాట్‌కు రావాలని సూచించాడు. దీంతో అపార్టుమెంట్ కు వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతనిని ప్రతిఘటించింది.

దీంతో ఆమెపై దాడికి దిగి, బెల్టుతో ముఖం, వీపుపై కొట్టి బయటకు గెంటేశాడు. తీవ్ర అవమానభారంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles