AAP minister Imran Hussain mobbed by Staff లేచింది నిద్రలేచింది ఉద్యోగుల లోకం.. చిత్తడయ్యింది మంత్రికి పాపం..

Aap minister imran hussain mobbed by government officials at delhi secretariat

Aam Aadmi Party, AAP minister, Imran Hussain, Himanshu, minister thrashed by staff, secretariat staff thrashed minister, arvind kejriwal, delhi chief secretary anshu prakash, delhi cs anshu prakash assault, boycotting duties, Delhi Secretariat, anshu prakash, Lt governor

Aam Aadmi Party (AAP) minister, Imran Hussain and his aide Himanshu being thrashed by the staff members, at Delhi Secretariat by the staff, after the midnight madness of delhi chief secretary anshu prakash assault.

ITEMVIDEOS: అప్ అమాత్యుడికి పరాభవం.. సెక్రటేరియట్ లో కుమ్మేసిన ఉద్యోగులు

Posted: 02/20/2018 07:43 PM IST
Aap minister imran hussain mobbed by government officials at delhi secretariat

లేచింది నిద్రలేచింది ఉద్యోగుల లోకం.. చిత్తడయ్యింది అమాత్యుడికి పాపం.. ఏంటీ ఇలా పాటను మార్చేశారు అంటున్నారా..? లేక ఏ దేశంలో బాబు.. అని అర్థం చేసుకుని అడుగుతున్నారా..? అగండాగండీ.. ఇది ముమ్మాటికీ జరిగింది మన దేశంలోనే.. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే. ఔనా..? అంటూ అశ్చర్యపోతున్నారా..? నిజమేనండీ.. ఉద్యోగుల నిరసనలు, నినాదాల మధ్య తన ఛాంబర్ లోకి వెళ్లేందుకు యత్నించిన ఓ మంత్రివర్యులను. అతని అనుచరుడిని పట్టుకుని సెక్రటేరియట్ సిబ్బంది చావచితక బాదారు.

అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలను కూడా తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇప్పుడా వీడియోలు సామాజిక మాద్యమాల్లో సంచలనంగా మారాయి. ఎందుకిలా అంటే నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఓ సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ పై అసభ్యపదజాలం వినియోగించడంతో పాటు దాడి చేశారని ఆయన పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు గవర్నర్ ను కూడా కలసి తనపై దాడి జరిగిన వివరాలను తెలిపారు.

దీంతో సీఎస్ పై దాడి చేసిన ఎమ్మెల్యేలను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. సెక్రటేరియట్ వద్ద రెండో అంతస్థులో గుమ్మిగూడిన ఉద్యోగులు నినాదాలు, నిరసలు ఇచ్చారు. అయితే అదే సమయంలో సెక్రటేరియట్ లోని అరవ అంతస్థులో వున్న తన ఛాంబర్ లోకి వెళ్లేందుకు సిద్దమైన మంత్రి ఇమ్రాన్ హుస్సెన్ తన పీఏ హిమాన్షు సింగ్ తో అక్కడికి చేరకుని లిప్ట్ వద్దకు చేరుకోగానే వందల సంఖ్యలో ఉద్యోగులు అక్కడకు చేరుకుని వారిపై దాడి చేశారు. మంత్రితో పాటు హిమాన్షు సింగ్ ను దారుణంగా కొట్టారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద స్థాయిలో చేరుకుని మంత్రితో పాటు పీఏను కూడా వారి ఛాంబర్ వద్దకు చేర్చారు. అనంతరం ఈ దాడిపై స్పందించిన మంత్రి తనపై దాడి చేసింది నిజంగా ఉద్యోగులేనా..? లేక బయటి వ్యక్తులా..? అన్నది తనకు తేలియలేదని అన్నారు. అయితే తనపై దాడి చేసిన వారిని మాత్రం తాను గుర్తుపడతానని అన్నారు. తనపై దాడి జరిగిన ఘటనపై మంత్రి స్వయంగా ఐపీ ఎస్టేట్ పొలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే దాడికి సంబంధించిన వీడియోను కూడా అప్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తాము మంత్రిపై దాడి చేయలేదన్న ఉద్యోగుల వాదన పటాపంచలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles