criminal targets single women through facebook ఒంటరి మహిళలకు వల విసిరి.. సర్వం దోచేస్తున్న క్రిమినల్..

Criminal targets single women through facebook

rangaswamy, illegal affairs, single women, hyderabad, nacharam, lalaguda, facebook, 20 victioms trapped, rachakinda police, telangana, crime

An old criminal RangaSwamy held by Rachakonda Police for cheating single women through facebook. Police identified that he cheated above 20 women, all those are singles. He had been accused of a Murder case and few another cases.

ఒంటరి మహిళలకు వల విసిరి.. సర్వం దోచేస్తున్న క్రిమినల్..

Posted: 02/20/2018 12:25 PM IST
Criminal targets single women through facebook

జల్సాలకు అలవాటుపడిన ఓ పాత నిందితుడు.. ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ నే ఎంచుకున్నాడు. తన జల్సాలతో పాటు సరదాలు తీరేందుకు మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు. అతని టార్గెట్ ఒంటరి మహిళలే. ఫేస్ బుక్ ద్వారా ఒంటరిగా వున్న మహిళలతో చాటింగ్ చేసి వారిని తన మాటలతో మాయ చేసి.. వారికి శారీరికంగా దగ్గరైన తరువాత.. అసరాలు వున్నాయంటూ లక్షల రూపాయలు తీసుకుని ముఖం చాటేస్తాడు. ఇలా ఒక్కరిని, ఇద్దరి కాదు ఏకంగా 20 మందిని ఒంటిరి మహిళలను టార్గెట్ చేసిన నిందితుడ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి.. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చి స్థిరపడ్డాడు. అయితే చదువూ సంధ్య లేకపోయినా సంఘంలో గౌరవంగా బతికిన వాళ్లను అదర్శంగా తీసుకోవాల్సిన రంగస్వామి.. కేవలం తన జల్సాలు, సరదాల కోసం వక్రమార్గం పట్టాడు. 5వ తరగతి వరకే చదువుకున్నా.. బుర్రలో మాత్రం పుట్టెడు దుర్బుద్దులు వున్నాయి. అంతే తన సరదాలు, జల్సాలను తీర్చుకునేందుకు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకన్నాడు. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా వారితో చాటింగ్ చేసి.. వారికి దగ్గరయ్యేవాడు. వారితో శారీరికంగా కలసిన తరువాత తనకు అత్యంత అవసరంగా డబ్బు అవసరమైందని వారి నుంచి లక్షల రూపాయలు తీసుకునేవాడు.

అ తరువాత ముఖం చాటేసేవాడు. ఇలా అతని చేతిలో మోసపోయినవారంతా ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలే. అందుచేతనే అతని అడగాలు గత కొన్నాళ్లుగా సాగుతున్నాయి. తమకు జరిగిన అన్యాయం గురించి  బయటకొచ్చి గొంతు వినిపిస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు. దీనినే అసరగా చేసుకున్న నిందితుడు అలాంటి వారినే ఎంచుకుని టార్గెట్ చేయడం ప్రారంభించాడు. అయితే ఇతని చేతిలో దారుణంగా మోసపోయిన ఓ మహిళ.. అతనిపై రాచకొండ పోలీసులకు పిర్యాదు చేసింది. తన వద్ద రూ.3లక్షల వరకు గుంజడమే కాక, పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ లాలాగూడ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగస్వామి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ ప్రారంభించగానే ఏకంగా డొంక మొత్తం కదిలింది. ఫేస్ బుక్ ద్వారా ఏకంగా 20 మంది ఒంటరి మహిళలను తాను లొబర్చుకున్నానని రంగస్వామి విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇతడు కొత్తగా ఈ పంథా ఎంచుకున్నా.. ఇతను పాత నేరస్తుడేనని పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. గతంలో నాచారం పరిధిలోని మల్లాపురంలో ఒక ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు కుషాయిగూడలో ఒక మహిళపై అత్యాచారం జరిపిన కేసులోనూ రంగస్వామి నిందితుడే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles