Convict escapes from police custody పోలీసుల కళ్లలో కారం.. రిమాండ్లో వున్న గ్యాంగ్ స్టర్ పరార్..

Gangster flees from custody after aides throw chilli powder at cops

gangster Sandeep Kumar, gangsters Neeraj Bawana, Sandeep Mental, Tillu, Police custody, Maulana Azad Institute of Dental Science, Braj Mohan, Naresh Pal, Yogender, Escaped, chilli powder, bullets, chilli powder, accomplices, delhi murder convict, murder convict sandeep kumar dhillon, sandeep kumar dhillon, crime

A gangster Sandeep Kumar alias Sanjay alias Dhilloo was escaped from police custody under a hail of bullets when he was brought to Maulana Azad Institute of Dental Science.

పోలీసుల కళ్లలో కారం.. రిమాండ్లో వున్న గ్యాంగ్ స్టర్ పరార్..

Posted: 02/20/2018 01:20 PM IST
Gangster flees from custody after aides throw chilli powder at cops

సీనీ పక్కిలో పోలీసుల కళ్లలో కారం చల్లి రిమాండ్ ఖైదీగా వున్న తమ గ్యాంగ్ స్టర్ ను అనుచరులు తీసుకెళ్లిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వెంటనే తేరకున్న పోలీసులు వారి వాహనాల టైర్లను కాల్చేందుకు కాల్పులు జరిపినా.. జనసామర్థ్యం అధికంగా వుండటంతో వారు యధేశ్చగా తప్పించుకున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందన్నఅరోపణల నేపథ్యంలో అందుకు బాధ్యులైన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే నిందితులను బేడీలతో తీసుకురాకూడదన్న అంక్షల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు బాధిత పోలీసుల అరోపిస్తున్నారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వున్న గ్యాంగ్‌స్టర్ సందీప్ కుమార్ అలియాస్ సంజయ్ అలియాస్ ధిలూ పంటి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఈనెల 9న మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు తీసుకొచ్చిన పోలీసులు అతనికి మైనర్ సర్జరీ చేశారు. మళ్లీ ఈ నెల 19న తీసుకురావాలన్న వైద్యుల సూచనలతో క్రితం రోజున ధిల్లూను అస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న అతని అనుచరులు అతడ్ని తప్పించేందుకు ప్రణాళిక వేశారు.

సోమవారం ఏఎస్సై బ్రజ్ మోహన్, నరేశ్ పాల్, హెడ్ కానిస్టేబుల్ యోగేందర్ లు థిల్లూను ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యుల చేత పరీక్షలు చేయించారు. ఇక అతడ్ని తమ అదుపులోకి తీసుకుని మళ్లి రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసులు ఉదయం 11:15 గంటల సమయంలో అస్పత్రి నుంచి బయటకు వస్తుండగా, అప్పటికే గేటు దగ్గర రెండు బైకులు, ఒక స్కూటర్ పై మాటువేసిన ధిల్లూ అనుచరులు.. పోలీసుల కళ్లలో కారం చల్లారు. వారు కారం మంటలతో తల్లడిల్లతుండగానే ధిల్లూ ను అక్కడి నుంచి తప్పించి తమ వాహనాలపై ఎక్కించుకుని పారిపోయారు.

ఈ హఠాణ్పరిణామంతో షాక్ కు గురైన పోలీసులు తేరుకుని స్కూటర్‌పై పారిపోతున్న ధిల్లూ వాహనా టైర్లను కాల్చేందుకు కాల్పులు జరిపారు. అయితే మరో పోలీసు వారి చెంతకు చేరకుని పట్టుకునే ప్రయత్నం చేయగా, చంపేస్తామని అగంతకులు తమ చేతిలోని తుపాకీని గురిపెట్టడంలో అతని వదిలిపెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అస్పత్రి వద్ద జనసామర్థ్యం అధికంగా వుండటంతో వారు తప్పించుకున్నారు. కాగా, పోలీసుల జరిపిన కాల్పుల శబ్దానికి ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles