MLA Harris' son surrenders in Bengaluru pub brawl case పోలీసులకు లొంగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తనయుడు

Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

Bengaluru congress, Nalapad, Pub attack, mla harris son, mla harris, harris son, congress mla son, haris mla son na, harris mla, harris son marriage, bengaluru news, karnataka congress MLA Son, member of the legislative assembly youth congress leader mohammed nalapad surrenders brutal attack, MLA Harris, son, mohammad Nalapad, vidwath, Congress, siddaramaiah, chief minister, karnataka

Bengaluru MLA NA Harris's son Mohammed Nalapad has surrendered to the police after an FIR was filed against him for assaulting a man at a restro-bar on Saturday night.

36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

Posted: 02/19/2018 03:03 PM IST
Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా నిందితులు ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కోనడంతో ఇక చేసేది లేక.. అహంభావం పాదాల చెంతకు చేరడంతో.. పోలీసుల ఎదుట లోంగిపోయాడు. అయితే ఏకంగా 36 గంటల పాటు పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఎమ్మెల్యే తనయుడు చివరకు పొలీసుల ఎదుట లొంగిపోయాడు. తన అహంకారంతో అకారణంగా ఓ యువకుడిని చావచితక బాది.. అతని ప్రాణాపాయస్థితికి కారకుడయ్యాడు. ఇక ఘటన పూర్తివివరాల్లోకి వెళ్తే..

బెంగళూరు ఎమ్మెల్యే ఎన్ఏ హార్రిస్ కుమారుడు మహ్మద్ నలాపాడ్ గత శనివారం నగరంలోని ఓ పబ్ కు తన 12 మంది స్నేహితులతో కలసి వెళ్లాడు. అక్కడ అతడితో పాటు అతడి 10 మంది స్నేహితులు విద్వత్ అనే యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. విద్వత్ అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడని, వైద్యులు చెప్పారు. అసలు విద్వత్ తో గొడవ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? అంటే.. విద్వత్ కాలు గతంలో విరగడంతో.. ఆయన పబ్ తో తనకు సౌకర్యవంతంగా వుండేవిధంగా కూర్చున్నాడు. అయితే అతడు కూర్చున్న తీరు నలాపాడ్‌కు నచ్చకపోవడంతో ఆ యువకుడితో గొడవకు దిగాడు.

అంతటితో అగకుండా తన స్నేహితులతో కలిసి విద్వత్ ను పబ్ లోనే పట్టుకుని దారుణంగా చావబాదాడు. ఏదో అనుకోకుండా ఉద్వేగానికి గురై దాడి జరిగిందని అనుకుని వుంటే అయిపోయేది. అయితే తలనిండా వున్న ఎమ్మెల్యే తనయుడినన్న బిరుసు మాత్రం పోలేదు. దీంతో ఏకంగా విద్వత్ చికిత్స పోందుతున్న అస్పత్రికి వెళ్లి కూడా బెదిరింపులకు పాల్పడి మళ్లీ దాడి చేశాడు. దీంతో బాధితుడి పోలీసులను అశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే కుమారుడు మహ్మద్ నలాపాడ్ సహా అతని స్నేహితులైన పదిమందిపై కేసు నమోదు చేశారు.
 
బెంగళూరు కాంగ్రెస్ యువజన విభాగం కార్యదర్శిగా ఉన్న నలాపాడ్‌ను పదవిలో నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ వ్యవహారంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ఈ దాడికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. ఒక్కర్ని కూడా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బెంగళూరు కమిషనర్ సదరు నిందితులపై చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు..’’ అని పేర్కొన్నారు. దీంతో ఇక గత్యంతరం లేక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లి.. పరారీలో వున్న ఎమ్మెల్యే కుమారుడు.. నలాపాడ్ ఎట్టకేలకు ఘటన జరిగిన 36 గంటల తరువాత ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Harris  son  mohammad Nalapad  vidwath  Congress  siddaramaiah  chief minister  karnataka`  

Other Articles