Jaya prakash narayan support Pawan Kalyan ideologies పవన్ కల్యాన్ అలోచనలను కొనియాడిన జేపీ

Jaya prakash narayan support pawan kalyan on ap special status

Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JAC, Pawan Kalyan Press meet, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

Loksatta founder president Jaya Prakash Narayan says he is impressed by the ideologies of actor turned politician, Jana sena chief power star Pawan Kalyan on planning an jac to achive union government promises and special status to andhra pradesh

ITEMVIDEOS: పవన్ కల్యాన్ అలోచనలను కొనియాడిన జేపీ

Posted: 02/08/2018 04:36 PM IST
Jaya prakash narayan support pawan kalyan on ap special status

విభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులతో ఐక్యవేదికను ఏర్పాటు చేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాన్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. పవన్‌ చెప్పినట్లు ఒక గంటలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదని అన్నారు. బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఎంతో భవిష్యత్‌ ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాన్ ను తాను అభినందిస్తున్నానని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. మనల్ని పెంచిన సమాజానికి తిరిగి మనం కూడా ఏదైనా చేయాలన్న బలమైన ఆకాంక్ష ఉంటేనే అది సాధ్యమని కొనియాడారు. దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే అన్నట్లు కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ సాధించుకునే వేదకకు అందరూ పెద్దలేనని, స్వచ్చందంగా అందరూ ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు.

రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించి చట్టం చేసిన తర్వాత కూడా విభజన హామీలను అమలు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరు ఏరు దాటక తెప్ప తగలేసినట్లు వుందని జయప్రకాష్ నారాయణ ఎద్దేవాచేశారు. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదన్నారు. విభజన హామీల అమలు కోసం వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్‌ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. హామీలను ఏ రకంగా సాధించాలన్న అంశంపై అందరూ కలిసి చర్చిస్తామని తెలిపారు.

దిశానిర్దేశం చేయాలని కోరా: పవన్‌

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, కేంద్రం వాటిని నెరవేర్చేలా ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలని జేపీని కోరినట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. విభజన సమయలో ఆయన ఎంతో అధ్యయనం చేశారని వివరించారు. తదుపరి భేటీ వివరాలను త్వరలో తెలియజేస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles