Brave wife saves husband from attackers భర్తపై దుండగుల దాడి.. కాపాడిన భార్య..

Brave wife scares away husband s attackers with gun

Amrapali Vihar, Attack caught on CCTV, Goons attack man in Lucknow, SSP Lucknow, Woman Opens Fire in Lucknow, Lucknow, Lucknow firing, journalist, goons attack, lawyer wife, Lucknow police, Uttar Pradesh

Local journalist Abid Ali's wife emerged from inside the house with a service revolver and started firing on the goons to rescue her husband in Amrapali Vihar in the Kakori area of Lucknow.

ITEMVIDEOS: జర్నలిస్టు పతిని.. తుపాకీతో వచ్చి కాపాడిన లాయర్ సతి..

Posted: 02/05/2018 06:50 PM IST
Brave wife scares away husband s attackers with gun

పతియే ప్రత్యక్ష దైవం అని భారతీయ నారీమణులు భావిస్తారు. అదే పతిపై ఎవరైనా అగంతకులు దాడి చేస్తే మాత్రం కేకలు వేస్తూ జనాన్ని పోగేసుకునేందుకు తయారవుతారు. ఈ లోపు అగంతకులు వచ్చిన పని కానిచ్చి పారిపోవడం అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు అన్ని సినిమాల్లో చూపించే తంతే. అడది అపర కాళీ అని, వారు తలచుకుంటే దుండగుల బారి నుంచి తమ భర్తను కాపాడుకుని ప్రతి రోజు వారింట్లో దీపావళిని జరుపుకుంటారని ఈ భార్యమణి రుజువుచేసింది.

తన కళ్లముందే భర్తను దుండగులు కొడుతూ, కర్రలు, రాడ్ లతో దాడి చేస్తుంటూ తట్టుకోలేకపోయిన ఆ భార్యమణి ఏకంగా ఇంట్లోంచి రివాల్వర్ ను తీసుకువచ్చి వారిని భయపెట్టేందుకు ప్రయత్నించింది, అయినా వారు పట్టించుకోకపోవడంతో అమె ఏకంగా గాల్లోకి కూడా కాల్పులు జరిపింది. కాల్పుల శద్దం విన్న దుండగులు కాళ్లకు బుద్ది చేప్పడంతో.. తన భర్తను కాపాడుకోగలిగింది. సినిమాను తలపించే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

లక్నోలోని కాకోరీ ప్రాంతానికి చెందిన అబిద్ అలీ వృత్తిపరంగా జర్నలిస్టు. ఇవాళ ఉదయం అలీ ఇంటి గేలు వద్ద నున్న బెల్ స్విచ్ ఎవరో మ్రెగించారు. దీంతో బయటకు వచ్చిన అలి తన ఇంటి ముందు నిల్చుని మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అలీపై దాడి చేయడం ప్రారంభించారు. కాళ్లతో తంతూ. చేతులతో కోడుతూ దాడికి పాల్పడ్డారు. అందులోని ఓ వ్యక్తి పరుగెత్తుకుని వెళ్లి లాపుపాటి కర్రను కూడా తీసుకొచ్చి మరీ అలీని విచక్షణా రహితంగా కొట్టాడు. నలువైపుల నుంచి అలీని చుట్టుముట్టిన అగంతకులు దాడి చేశారు.

తన భర్త అలి అరుపులు విన్న అతడి భార్య అందోళనకు గురికాకుండా.. ఎంతో ధైర్యంతో తుపాకీని తీసుకుని ముంగిట్లోకి వచ్చింది. తన భర్తపై దాడి చేస్తున్న అగంతకులపై గురిపెట్టింది. అయినా వారు భయపడలేదు, దీంతో వెంటనే రెండు రౌండ్ల బులెట్లను గాల్లోకి కాల్చింది. కాల్పుల శబ్దం విన్న అగంతకులు పలాయనం చిత్తగించారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే అలీపై ఎవరు దాడి చేశారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా.. అలీ భార్య వృత్తిపరంగా లాయర్‌ అని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lucknow  firing  journalist  goons attack  lawyer wife  Lucknow police  Uttar Pradesh  

Other Articles