Middle class 'disenchanted' with BJP: Kejriwal ఎన్నికలలో బీజేపీ సీట్లపై అరవింద్ జోతిష్యమిదే..

Bjp to get less than 215 seats in upcoming general elections claims kejriwal

Arvind Kejriwal, Amit Shah, BJP, AAP, budget, middle class, General Elections, Congress, youth, unemployment, politics

Delhi Chief Minister Arvind Kejriwal turned election predictor and claimed that the BJP would not win more than 215 seats in the 2019 General Elections.

రానున్న ఎన్నికలలో బీజేపీ సీట్లపై అరవింద్ జోతిష్యమిదే..

Posted: 02/05/2018 06:24 PM IST
Bjp to get less than 215 seats in upcoming general elections claims kejriwal

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపికి భంగపాటు తప్పదని ఆమ్ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. గత 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపి సాధించిన సీట్లు సంఖ్య కన్నా అధిక స్థానాలను రానున్న సార్వత్రిక ఎన్నికలలో సాధిస్తామని బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన నేపథ్యంలో దానిపై పక్షం రోజుల తరువాత స్పందించిన అరవింద్ కేజ్రీవాల్.. రానున్న ఎన్నికలలో మోడీ మానియా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి 215 స్థానాలకు మించి రావని ఆయన తేల్చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్లతో ఈ విషయాన్ని పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం కొంత మంది తనని కలిశారని, ఇదే విషయాన్ని వారందరూ ఏకాభిప్రాయంగా చెప్పారని పేర్కోన్నారు. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా అవతరించిందని, దీంతో యువత సతమతం అవుతోందని అన్నారు, తమ భవిష్యత్తు గురించి దేశీయ యువత దిగులు పడుతున్నారని పేర్కోన్నారు.

ఇక ఇప్పటికే నోట్ల రద్దు వ్యవహారం మోడీ ప్రభుత్వానికి అశనిపాతంలో పరణిమించిందని, దీనికి తోడు జీఎస్టీ అటు సాధారణ ప్రజలతో పాటు ఇటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిణామాలతో మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు విసిగిపోయారని ఆ ట్వీట్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలను కేంద్రం ఇస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ప్రజలకు లబ్ది చేకూర్చేలా లదేన్న విమర్శల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ జ్యోతిష్యం కూడా వైరల్ గా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Amit Shah  BJP  AAP  budget  middle class  General Elections  Congress  youth  unemployment  

Other Articles