pawan kalyan to visit srikakulam on 21st Feb. మత్స్యకారుల సమస్యలపై పోరాటానికి జనసేన మద్దతు..

Janasena chief pawan kalyan to visit srikakulam on 21st feb

Pawan Kalyan Political Yatra, pawan kalyan political journey in srikakulam, pawan in sikkolu, pawan kalyan srikakulam fishermen, pawan kalyan on fishermen BC to ST promise, Pawan Kalyan Political Journey, pawan kalyan, janasena, fishermen, srikakulam, 13 districts, malladi krishna rao, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan said he is unaware of problems of fishermen in the coastal parts, hence he is to visit srikakulam on 21st Feb, and meet them and known their issues and represent and remember government on behalf of them.

ITEMVIDEOS: 21న జనసేనాని శ్రీకాకుళం పర్యటన.. మత్స్యకారుల బస్తీల్లోనూ..

Posted: 02/05/2018 05:42 PM IST
Janasena chief pawan kalyan to visit srikakulam on 21st feb

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాల్లో పర్యటించిన జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ స్టార్ పవన్ కల్యాన్ ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల బస్తీల్లోనూ ఆయన పర్యటిస్తానని, అక్కడి సమస్యలను తెలుసుకుంటానని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ఇవాళ పవన్ కల్యాన్ ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని మత్స్యకారులు నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో పవన్ కల్యాన్ ను కలుసుకున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మత్స్యకార ప్రతినిధులు తమ ప్రతినిధలుగా యానం నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుదుచ్చెరి మంత్రి మల్లాది కృష్ణారావుతో పాటుగా వచ్చారు. మంత్రిని సాదరంగా పార్టీ కార్యాలయంలోకి అహ్వనించిన పవన్ కల్యాన్.. వారికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 21న జరిగే శ్రీకాకుళం పర్యటన తరువాత వీరి సమస్యలపై ప్రభుత్వాన్ని కోరుతానని హామి ఇచ్చారు. మత్స్యకారులకు ప్రభుత్వమిచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలన్నారు.

గత ఎన్నికల ముందు మత్స్యకారులను బీసిలకు బదులు ఎస్టీల జాబితాలో చేర్చుతామని చెప్పడంతో పాటు టీడీపీ పార్టీ ఏకంగా తమ పార్టీ మానిఫెస్టోలో కూడా పెట్టిందని, అయితే నాలుగేళ్లు గడుస్తున్నా తమకిచ్చిన హామీపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని అన్నారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలకు పార్టీలు, ఆయా పార్టీల నేతలు క‌ట్టుబ‌డి ఉండాల‌ని, వాటిని నెరవేర్చాలని అన్నారు. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ను గురించి క‌మిటీ వేస్తామ‌ని చెప్పార‌ని అన్నారు.

మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, వారి సమస్యలపై మరింత అధ్యయనం చేస్తానని పవన్ తెలిపారు. మ‌త్స్యాకారుల‌ను ఎస్టీల్లో చేర్చడానికి ఇప్పటికైనా ప్రభుత్వాలు చోరవ చూపించాలని ఆయన సూచించారు. మత్స్యకారుల హామీలకు మద్దతుగా సాగుతున్న పోరాటానికి తమ పార్టీ మద్దతు నిస్తుందని చెప్పారు. కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శాంతియుతంగా వారు చేస్తోన్న దీక్షలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. మత్స్యాకారులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  fishermen  srikakulam  13 districts  malladi krishna rao  andhra pradesh  politics  

Other Articles