gajwel pratap reddy alleges CM kcr will encounter him తెలంగాణలో పోలీసు రాజ్యం.. ప్రభుత్వానికి ఓటమి భయం..

Gajwel pratap reddy alleges cm kcr will encounter him

Telangana chief minister KCR, kcr scared defeat gajwel constituency, TRS party defeat telangana, TDP Leader vanteru pratap reddy, police rule in telangana, kcr encounter pratap reddy, KCR, gajwel constituency, defeat, vanteru pratap reddy, police rule, TDP, telangana, politics

Telangana chief minister KCR is scared of his defeat in gajwel constituency and his party in telangana says vanteru pratap reddy, who also alleges that cm may encounter him in this regard.

ITEMVIDEOS: తెలంగాణలో పోలీసు రాజ్యం.. ప్రభుత్వానికి ఓటమి భయం..

Posted: 01/30/2018 09:51 AM IST
Gajwel pratap reddy alleges cm kcr will encounter him

మూడున్నరేళ్లుగా తమదే పైచేయిగా సాగిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురుస్తుంది. నల్గోండ జిల్లాలోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅనుచరుడి దారుణ హత్య తరువాత మరో అనుచరుడి హత్య జరగడంతో ఇప్పటికే తెలంగాణలో దోరల పాలన గుర్తుకువస్తుందని కోమటిరెడ్డి ఆరోపించారు. హత్యారాజకీయాలు చేస్తూ ప్రభుత్వం ప్రత్యర్థులను భయాందోళనకు గురిచేస్తుందని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.

ఈ ఘటన మర్చిపోకముందే.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వల్ లోని తన ప్రత్యర్థి అభ్యర్థి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీకి చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇదే తరహా అరోపణలు గుప్పించారు. తన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం వుందని, ఇందుకు కేసీఆర్ స్వయంగా కుట్రపన్నుతున్నారని అరోపించారు. తనను ఎన్ కౌంటర్ చేయించాలని పక్కా ప్లాన్ వేసుకుంటున్నారని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకు పోలీసులను కూడా పురమాయించాడని అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మురళి ఆత్మహత్య అనంతరం జరిగిన అల్లర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈనెల 9న వంటేరును అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిలు లభించడంతో సోమవారం రాత్రి చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనను పోలీసులతో ఎన్‌కౌంటర్ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తున్నారని పేర్కొన్న ఆయన తనకేదైనా జరిగితే దానికి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని, ఆ భయంతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించారని వంటేరు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికీ తిరిగి మరీ గజ్వేల్ ప్రజలకు వివరిస్తానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కోదండరాం పర్యటనకు అనుమతి ఇవ్వని పోలీసులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. కాగా, వంటేరు విడుదలవుతున్న సంగతి తెలుసుకున్న వందలాదిమంది కార్యకర్తలు చంచల్‌గూడ జైలు వద్దకు తరలి రాగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  gajwel constituency  defeat  vanteru pratap reddy  police rule  TDP  telangana  politics  

Other Articles