Siddheshwar Swami turns down Padma Shri ‘పద్మశ్రీ’ని వద్దన్న సిద్దేశ్వర్ స్వామీజి

Siddheshwar swamiji refuses to accept padma shri award

Siddheshwar Swamiji, padma shri, Siddheswara Swami, Padma Shri awards, Siddheshwar Swamiji, padma shri award, decline to accept padma shri, Siddheshwar Swami karnataka seer Siddheshwar Swami, Siddheshwar Swami refuses padma shri

Spiritual leader Siddheshwar Swamiji of Vijaypur has written to Prime Minister Narendra Modi refusing to accept the Padma Shri award which was conferred upon him

‘పద్మశ్రీ’ని వద్దన్న సిద్దేశ్వర్ స్వామీజి

Posted: 01/29/2018 11:21 AM IST
Siddheshwar swamiji refuses to accept padma shri award

'పద్మ' పురస్కారాల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకం చేశామని ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ఎవరి సిఫార్సులూ అవసరం లేకుండానే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కేంద్రం తనకు ప్రకటించిన అవార్డును ఓ అద్యాత్మిక గురువు సున్నితంగా తిరస్కరించారు. ఈ స్వామీజీ అవార్డును తిరస్కరించడంతో.. ఇప్పుడు కొత్తగా మరో అంశం చర్చకు దారితీసింది.

చాలా మంది సామాన్యులకు అవార్డులను దగ్గర చేశామని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిన క్రమంలో అద్యాత్మిక వేత్తలకు అవార్డులను అందజేయడం.. దానిని వారు స్వీకరించడం కూడా ప్రధాన చర్చకు తెరలేపింది. పేర్లతో సంబంధం లేకుండా వారు చేసిన సేవలను చూసి మాత్రమే విజేతలను ఎంపిక చేశామని ప్రధాని చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్న దేశప్రజలు.. ఆధ్యాత్మిక వేత్తలకు, సన్యాసి జీవితాలను గడుపుతున్న ప్రముఖులకు, యోగా గురువులకు అవార్డులను ప్రకటించడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇందుకు ప్రధాన కారణం కర్ణాటకలోని అద్యాత్మిక గురువు కేంద్రబిందువుగా మారారు. ఆయన ఏకంగా తనను వరించిన 2018 ఏడాదికి కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. కర్ణాటకకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, జ్ఞాన యోగాశ్రమ స్వామీజీ సిద్ధేశ్వర్ స్వామికి పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం. అయితే సదరు స్వామీజి మాత్రం ఈ అవార్డును సున్నితంగా తిరస్కరించారు.

ఈ మేరకు ఆయన తన తిరస్కారాన్ని తెలియపరుస్తూ.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. తానొక సన్యాసి అని.. ఏ పురస్కారాలు, గౌరవాలపై తనకు మక్కువ లేదని, ఇలాంటివాటిపట్ల తనకు ఇష్టం చాలా తక్కువని అందుచేతే తనకు ఈ అవార్డులు అక్కర్లేదని సూచించారు. ఈ తరహా అవార్డులకు చాలామంది అర్హులైన ప్రముఖులున్నారని, వాళ్లని గౌరవించండని సూచించారు.

ఈ మేరకు తాన తీసుకున్న నిర్ణయాన్ని అటు కేంద్రంతో పాటు ఇటు ప్రధాని మోడీ స్వాగతిస్తారని కూడా అశిస్తున్నట్లు లేఖతో పేర్కోన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అవార్డులను ప్రకటించే కమిటీలు అధ్యాత్మిక వేత్తలను, సన్యాసులను, యోగా గురువులను ఎంపిక చేయడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతంది. సన్యాసులమని, తమకు ధన, కనక, వస్తు, వాహనాలపై మోజు వుండదని చెప్పే ప్రముఖులు పద్మశ్రీలను ఎందుకు స్వీకరిస్తున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddheshwar Swamiji  padma shri  spiritual leader  PM Modi  Letter  

Other Articles