pawan kalyan visits Puttaparthi Sathya Sai Samadhi సత్యసాయి జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ సహకారం

Jana sena president pawan kalyan visits puttaparthi

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Puttaparthi, pawan kalyan anathapur, pawan kalyan kadiri, pawan kalyan sathya sai samadhi, janasena, pawan kalyan, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan met Sathya Sai Central Trust member Ratnakar in Shanti Bhavan in Prashanti Nilayam in Puttaparthi.

ITEMVIDEOS: సత్యసాయి జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ సహకారం

Posted: 01/29/2018 10:32 AM IST
Jana sena president pawan kalyan visits puttaparthi

అనంతపురం జిల్లాలో జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ పర్యటన కొనసాగుతుంది. అనంతపురం జిల్లా  పర్యటనలో భాగంగా కదిరి పర్యటన ముగించుకుని పుట్టపర్తి చేరుకున్న పవన్ కల్యాన్.. నేరుగా సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అదేవిధంగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించిన పవన్‌ రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అసంఖ్యాక అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పుట్టపర్తి సత్యసాయిబాబా సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని అన్నారు. సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. సత్యసాయి పేదల అభివృద్దికోసం అశేషంగా సేవలు అందించారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు ఆయన త్రాగునీరు అందించారని అన్నారు.

నీటి ఎద్దడి తీవ్రంగా వున్న ప్రాంతాలను ఎంచుకుని మరీ అక్కడి ప్రజల దాహార్తిని తీర్చారని కొనియాడారు. ఇక పేదరోగులకు ఆయన అందించిన ఉచిత వైద్య సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు. ఇక పేదల ఉన్నత విద్యకు అందించేందుకు ఆయా రంగంల్లో సత్యసాయి విశేష సేవలందించారని, సత్యసాయి స్ఫూర్తితో ‘జనసేన’ ముందుకు పోతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ తో అరగంట పాటు శాంతిభవప్ లోని ప్రశాంతి నిలయంలో భేటీ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ananthapur  kadiri  puttaparthy  andhra pradesh  politics  

Other Articles