BJP Strong Counter to Chandrababu Ultimatum | బాబు కటీఫ్ వ్యాఖ్యలు.. బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్

Chandrababu on alliance with bjp

Andhra Pradesh, Chief Minister, Chandrababu Naidu, BJP, Alliance, 2019 Elections, Daggubati Purandeswari, Andhra Pradesh TDP BJP Alliance

BJP Strong Reaction to Chandrababu Naidu's Ultimatum. Daggubati Purandeswari asks Chandrababu about Defections. Previously AP CM in a Press Meet Says 'Ready to Go My Own Way if Not Needed'.. Chandrababu Naidu's Ultimatum to BJP. Naidu said he was disappointed by some comments made by state BJP leaders against his government recently and also questioned why the Centre is not granting special status to the state.

బాబు కటీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన

Posted: 01/27/2018 06:08 PM IST
Chandrababu on alliance with bjp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము ఇప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని... విడిపోవాలని బీజేపీ భావిస్తే నమస్కారం పెట్టేస్తామంటూ బాబు చెప్పటం కలకలమే రేపింది. ఇన్నాళ్లూ చాలా ఓపిక పట్టానని.. తన పార్టీ నేతలను ఎంతో కట్టడి చేశానని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు.

తాము(బీజేపీ) మిత్రధర్మం పాటించలేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని ఆమె అన్నారు. తమతో కలసి ఉంటారో, ఉండరో అనే విషయాన్ని టీడీపీనే తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. బీజేపీతో కలసి ఉండాలని టీడీపీ భావిస్తుంటే... అదే విషయం గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి సొంత పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని ఆమె విమర్శించారు.

పంచాయతీలకు కూడా కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతున్నాయని చెప్పారు. రాజీనామాలు చేశాకే టీడీపీలోకి రావాలని పార్టీ నేతలను దివంగత ఎన్టీఆర్ కోరేవారని, కానీ, చంద్రబాబు ఆ సూత్రాన్ని తుంగలో తొక్కేశారని పురందేశ్వరి పేర్కొన్నారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని... ఇదే విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని ఆమె చెప్పారు.

Daggubati Purandeswari Chandrababu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles