Pawan Kalyan Meets Sreeja in Kothagudem పవన్ కల్యాన్ అప్యాయతకు మురిసిన శ్రీజ

Pawan kalyan meets cancer victim sreeja after her recovery in kothagudem

Pawan Kalyan Political Yatra, kothagudem, cancer victim sreeja, sreeja brain fever, khammam hospital, Pawan Kalyan Political Journey, Pawan Kalyan khammam, party activists meet, nalgonda janasena activists, warangal party activists meet, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Pawan Kalyan met 'Cancer Victim Sreeja' after her recovery in Kothagudem. Pawan Kalyan's fan Sreeja and her family members wished PK to become the next CM. Pawan kalyan also wished all the best for Sreeja.

ITEMVIDEOS: శ్రీజను అప్యాయంగా అక్కున చేర్చుకున్న పవన్ కల్యాన్

Posted: 01/24/2018 11:15 AM IST
Pawan kalyan meets cancer victim sreeja after her recovery in kothagudem

హుద్దూత్ తుఫాను విలయతాండవంతో కాకావికళమైన విశాఖపట్నంలో పర్యటించి.. అక్కడి వారికి తాను వున్నానంటూ ధైర్యాన్ని అందించి.. బిజీగా వున్న జనసేన అధినేత సీనీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్.. మీడియా ద్వారా జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి.. తనను చూడాలన్న అఖరు కొరికను వ్యక్తం చేసిందని తెలుసుకున్నారు. అంతే విశాఖ నుంచి నేరుగా ఖమ్మం అసుపత్రికి చేరకునేందుకు అప్పటికప్పుడు ఆయన ప్లాన్ చేసుకున్నారు.

మార్గమధ్యంలో తాను ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తినా.. వెనుకంజ వేయలేదు.. చిన్నారిని చూడాలని, అమెను కలవాలని, అమెకు మనోధైర్యాన్ని ఇవ్వాలని సంకల్పంచిన పవన్.. అమెను చూసేందుకు మరో కారును తెప్పించుకుని మరీ అసుపత్రికి వెళ్లారు. అక్కడ చిన్నారి శ్రీజను అప్యాయంగా పలకరించి.. నేను వచ్చాను.. నీకేం కాదు.. ధైర్యంగా వుండి. మనోధైర్యమే పరమౌషదం అంటూ చెప్పాడు.

శ్రీజ తల్లిదండ్రులను కూడా పరామర్శించిన పవన్ వారికి వైద్యఖర్చుల నిమిత్తం అర్థిక సాయాన్ని అందించాడు. చిన్నారికి పలు వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. 2014 అక్టోబర్ లో ఇది జరిగింది. కట్ చేస్తే ఆ తరువాత శ్రీజ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత తన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని పవన్ కల్యాన్ ను చూడటానికని హైదరాబాద్ కు వచ్చింది.

ఇక మళ్లీ ఇన్నాళ్లు పవన్ తమ పట్టణానికి వస్తున్నాడని తెలిసిన శ్రీజ తన తండ్రితో పాటు కొత్తగూడెం చేరుకుంది. శ్రీజను చూసిన పవన్ అమెను అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. శ్రీజతో ఆప్యాయంగా మాట్లాడి దగ్గర చేర్చుకున్న పవన్ కల్యాణ్, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తన చదువులకు, భవిష్యత్తుకు అల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, ఇవాళ పవన్ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆపై ఆయన తొలి దశ తెలంగాణ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  sreeja  nagaian  cancer victim  jana sena  telangana  andhra pradesh  politics  

Other Articles