Veteran actress Krishna Kumari no more నటి కృష్ణకుమారీ ఇక లేరు..

Veteran actress krishna kumari passed away

krishna kumari, krishna kumari cancer, old actress krishna kumari, shavukaru janaki, shavukaru janaki sister, ace veteran actress, bone marrow cancer, passed away,celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood, kollywood

Ace veteran actress T Krishna Kumari, who happens to be one of the leading stars in the 60s 70s and 80s of Telugu cinema, is no more, she passed away in today morning suffering with bone marrow cancer.

ITEMVIDEOS: మొన్నటి తరం అందాలనటి కృష్ణకుమారీ కన్నుమూత

Posted: 01/24/2018 10:27 AM IST
Veteran actress krishna kumari passed away

మొన్నటి తరం మేటినటిగా.. యువత గుండెల్లో చెరగని ముద్రవేసిన కృష్ణకుమారీ ఇక లేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాగపడుతున్న అమె ఇవాళ ఉదయం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ అస్పత్రిలో చికిత్స పోందుతున్న అమె ఇవాళ పరమపదించారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ బాషల్లో నటించిన అమె అరవైల నుంచి ఎనబైల వరకు తిరుగులేని నాయికగా వెండితెరను ఏలారు.

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రనటిగా కొనసాగిన ఆమె... ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, కృష్ణా, శోబన్ బాబు, చలంలాంటి పాత తరం అగ్ర హీరోలందరి సరసన నటించారు. నటనలో సావిత్రికి ఏమాత్రం తక్కువ కాకుండా పోటీ పడి దక్షిణాదిలో అభిమానులను అరాధ్యనటిగా కూడా మారారు. విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు. నటి షావుకారు జానకీ సోదరిగా వెండితెరకు పరిచయమైన కృష్ణకుమారీ.. అక్కను మించిన పాపులారీటిని సోంతం చేసుకున్నారు.

కృష్ణకుమారీ అస్తమించారన్న వార్తతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలు విషాదంలోకి జారుకున్నాయి. అమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 'నవ్వితే నవరత్నాలు' సినిమాతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. భార్యాభర్తలు, కులగోత్రాలు, గుడిగంటలు, వాగ్దానం, పిచ్చిపుల్లయ్య, బంగారుపాప, వీరకంకణం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, నిత్యకల్యాణం పచ్చతోరణం, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, చిలకాగోరింక, మానవుడు దానవుడు, శ్రీకృష్ణావతారం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆమె నటించారు.

ఆమె మరణంతో సినీరంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో 1933 మార్చి 6న కృష్ణకుమారి జన్మించారు. సుమారు 110కి పైగా తెలుగు సినిమాల్లో కృష్ణకుమారి నటించారు. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను పెళ్లాడిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కుమార్తె ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna kumari  ace veteran actress  bone marrow cancer  passed away  tollywood  

Other Articles