Tirumala srivaru procession in tirumada streets రధ సప్తమి: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు..

Arasavalli suryanarayana temple spruced up for ratha saptami

ratha saptami, Surya Jayanti, Arasavalli sri suryanarayana temple, Arasavalli Temple, tirumala temple, tirumala srivaru, festival Tirumala temple Malayappa Swamy

The Suryanarayana Swamy temple at Arasavalli has been decked up for the Ratha Saptami festival along with tirumala srivaru at tirupathi who will give darshan in tirumada streets on seven vahanas.

రధ సప్తమి: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు..

Posted: 01/24/2018 08:50 AM IST
Arasavalli suryanarayana temple spruced up for ratha saptami

సకల ప్రపంచానికి ప్రత్యక్ష దైవంగా బాసిల్లుతున్న సూర్యనారాయణుడి జయంతి రధసప్తమిని పురస్కరించుకుని ఇవాళ తెలుగు రాష్ట్రాలల్లో ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జామునే లేచిన తెలుగువాళ్లు ఇవాళ సూర్యనారాయణ భగవానుడు ఉదయించే సమయానికి తమ ఇళ్లలో  హరతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం అలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో రధసప్తమి సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్థం నిన్న రాత్రి నుంచే భక్తులు ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్టు చేశారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏకంగా 900 మంది పోలీసులను ఇక్కడ అదనపు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

రధసప్తమిలో భాగంగా ఇవాళ శ్రీవారిని ఏడు వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమన శ్రీవెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారికి హారతులు పడుతూ గోవింద నామ స్మరణ చేశారు. ఈరోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్తవాహనాలపై శ్రీనివాసుడు వూరేగనున్నాడు. భక్తుల కోసం తితిదే విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అన్నపానీయ ఏర్పాట్లు చేసింది. మరికొద్దిసేపట్లో  స్వామివారు చిన్నశేషవాహన వూరేగింపు ప్రారంభమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles