తలకు హెల్మట్ ఎవరి కోసం పెట్టుకోవాలని నిబంధనను తీసుకువచ్చారు పోలీసులు అంటే.. మన సంరక్షణ కోసమేనని సమాధానమిస్తాం. అలాగే మద్యం తాగి వాహనాలను నడపరాదన్న నిబంధనలను పోలీసులు ఎందుకు తీసుకువచ్చారంటే.. ప్రమాదాలు చెప్పిరావు. మద్యం తాగినప్పుడు నియంత్రణ కోల్పోయిన పక్షంలో ప్రమాదం ఎదురైతే అది ఆ వ్యక్తి, వ్యక్తులు కుటంబాల భవిష్యత్తునే చిదిమేస్తుందన్నది సత్యం. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లు వద్దని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి మరీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దీంతో పెద్ద కేసుల నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోవచ్చు కానీ, డ్రండ్ అండ్ డ్రైవ్ కేసుల్లోంచి మాత్రం తప్పించుకోవడం కష్టమని అన్నివర్గాలకు చెందిన ప్రజలు భావిస్తున్నారు. వారే కాదు రాజకీయ నేతల నుంచి అందరిదీ ఇదే మాట. ఈ నేపథ్యంలో యువత మరింత విభిన్నంగా అలోచించింది. పోలీసులకు చెక్ పాయింట్ల వద్ద వారికి చెక్ పెట్టేందుకు మరో కొత్త ఎత్తుగడను పన్నింది. పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.
అసలింతకీ ఏం జరిగిందంటే... దగ్గర్లో బార్ ఉందో ఏమో... చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు. ఇంకేముందు, ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని నడుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. అలా ఒకరు, ఇద్దరూ కాదు... వందల మంది ఇలా బండి నడిపించుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదుగానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడిపించుకుని కూడా వెళ్లకూడదన్న చట్టం తేవాలేమో? ఆ వీడియోను మీరు వీక్షించండీ..
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more