what is wrong in meeting kcr: pawan kalyan కేసీఆర్ ను కలిస్తే తప్పేంటీ.? కాంగ్రెస్ నేతలకు పవన్ ప్రశ్న.?

Pawan kalyan says janasena contest in telangana assembly elections

Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan said he is unaware of problems of telangana, hence he is having a meeting with party cadre and then he will suggest solutions to solve them.

ITEMVIDEOS: తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ: పవన్

Posted: 01/22/2018 05:46 PM IST
Pawan kalyan says janasena contest in telangana assembly elections

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తెలంగాణలోనూ బరిలోకి దిగుతుందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. అయితే తెలంగాణలో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తామన్న విషయాన్ని ఎన్నికలకు రెండు నెలల ముందు తమ బలాన్ని బేరిజు వేసుకుని అప్పుడు నిలబెడతామని అన్నారు. అయితే ప్రస్తుతం తాను 2019లో తమ పార్టీకి వచ్చే సీట్ల కోసమే లేక ఓట్ల కోసమో కాదని పవర్ స్టార్ తేల్చిచెప్పారు.

కరీంనగర్ జిల్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొండగట్టు అంజనేయ స్వామి దర్శనం వల్ల తనకు మానసికోల్లాసం, ఆధ్యాత్మిక చింతన కలిగిందని అన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొండగట్టు అంజనేయస్వామి దయవల్ల సుసాధ్యమైందని అన్నారు. ఈ అంజనేయస్వామి దయవల్లే తాను పెను ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో ప్రమాదం సంభివించిందని పవన్ తెలిపారు. అందుకనే తెలంగాణలో తాను అంజన్న సన్నిధి నుంచి యాత్రను ప్రారంభిస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని సమస్యల పట్ల తనకు అవగాహన లేదని, అందుచేత తమ పార్టీ తరపున ఓ బృందాన్ని సమస్యల తెలుసుకునేందుకు పంపానని చెప్పారు. ఇక రెండు రోజుల పాటు తెలంగాణ కార్యకర్తలతో తాను చర్చించిన పిమ్మట వారి నుంచి సమస్యలపై అవగాహన తెచ్చుకుంటానని చెప్పారు. సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతంలో వాటికి పరిష్కారాలను కూడా కనుగోని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తానని పవన్ చెప్పారు.

త్వరలో అనంత, తరువాత విశాఖ, ఒంగోలు పర్యటన

నవ్యాంధ్రప్రదేశ్ లో సమస్యలపరంగా తనకు అవగాహన వుంది కాబట్టి.. అక్కడే మొద‌ట ప‌ర్య‌టించాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు. రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశంలో పాల్గోన్న తరువాత ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తాన‌ని చెప్పారు. అనంత పర్యటన సందర్భంగా అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తరువాత పార్టీ కార్యాలయం అనంతపురంలోనే ఏర్పటువుతుందని అన్నారు. దాదాపుగా మూడు రోజుల పాటు అక్కడ పర్యటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుని సంద‌ర్శిస్తాన‌ని పవన్ తెలిపారు.

అనంత‌పురం ప‌ర్య‌ట‌న త‌రువాత ఏపీలోని ఇత‌ర జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను నిర్ధేశించుకున్న ప్రకారం అనంత తరువాత విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్‌, కిడ్నీ బాధితులను కలుస్తామని ప్రకటించారు. అయితే తెలంగాణ అంటే తనకు ప్రేమ, గౌరవమని అన్నారు. తెలంగాణలో యువతలో కొంత నిర్లిప్తత వుందని, అది కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాల వల్ల కలిగిందేనని అన్నారు. అయితే ఖాళీలు వుండటం వేరు.. వాటిని భర్తీ చేయాలన్న సమయంలో అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని అన్నారు.

నిర్మాణాత్మకంగా అడుగు.. విధ్వంస రాజకీయాలకు దూరం..

అయితే చిత్తశుద్దితో పనిచేసే రాజకీయ పార్టీలు, ఈ సమస్యలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాయన్నది కూడా పరిగణలోకి వస్తుందని అన్నారు. తమ పార్టీ ప్రతీ అంశాన్ని రాజకీయాంగా చూడదని సమస్యలను ఎంత తర్వగా పరిష్కరిస్తామా..? అన్నదే తమ పార్టీలో్ని ప్రతీ జనసేనానికి వుంటుందని అన్నారు. తమ పార్టీ ప్రతి అడుగు నిర్మాణాత్మకంగానే వుంటుందని అన్నారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడబోమని చెప్పారు. తమ పార్టీ ముమ్మాటికీ ముమ్మాటికీ విధ్వంసకర రాజకీయాలు చేయదని అన్నారు. రాజకీయాలను అస్థిరపరిచే ఉద్దేశం తమ పార్టీ ఉద్దేశం ఏమాత్రం కాదని అన్నారు.

జనసేనలో రాజకీయ అవగాహన కలిగిన మేధావులెందరో..

తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వ‌ర‌లోనే త‌మ పార్టీలో చేరుతున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దీంతో పాటు తెలంగాణ సమస్యల పట్ల అవగాహన వుండి రాజకీయాలకు దూరంగా వున్న మేధావులెందరో కూడా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై తాము విస్తృతంగా చర్చ జరుపుతామ‌ని అన్నారు. తెలంగాణలోనూ పర్యటించాలని, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని తన అభిమానులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.

ఇతర పార్టీ నేతలకు పవన్ వెల్ కమ్..

జనసేనతో కలసి నడవాలని అనుకునే ఇతర పార్టీలకు చెందిన యువ నేతలను తమ పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. అయితే ఇతర పార్టీల నుంచి వారు ఎందుకు వస్తున్నారన్న అంశాలతో పాటు ప్రజలకు నిస్వార్థ సేవ, ప్రజా సమస్యల పరిష్కారం పట్లు చిత్తశుద్ది వున్న యువనేతలను తాము పార్టీలోకి అహ్వానిస్తామని చెప్పారు. ఇక తమతో కలసి వచ్చే యువనేతల అలోచనలను గౌరవించి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇక ఈ సమయంలో తాను ఎవరినీ రాజకీయంగా వాడుకోనని, తనను కూడా ఎవరూ రాజకీయంగా వాడుకోలేదని స్పష్టం చేశారు.

ఓటుకు నోటు కేసుపై స్పందించిన పవన్..

కాగా, ఓటుకు నోటు వ‌చ్చిన‌ప్పుడు తాను స్పందించ‌లేద‌ని, ఆ ప‌ని త‌ప్పు అని త‌న‌కు తెలుస‌ని, కానీ బాధ్య‌త‌తో మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అన్ని పార్టీలు విమ‌ర్శ‌లు చేశాయ‌ని, తానొక మాట అని స‌మ‌స్య‌పై మ‌రింత ర‌చ్చ చేయ‌కుండా ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలని ఆలోచించాన‌ని పవన్ తెలిపారు. అందుకే ఆ విష‌యంపై స్పందించ‌లేదని చెప్పుకొచ్చారు. రాజ‌కీయ‌ప‌రంగా ఎవ్వ‌రికీ ల‌బ్ది చేకూర్చే ప‌నులు తాను చేయ‌నని అన్నారు. త‌న ప్ర‌తి అడుగు పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అయితే అంధ్రప్రదేశ్ లో కుల పిచ్చి వుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన సమస్యలు కోకోల్లలు

ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన సమస్యలు అనేకమున్నాయని, వీటి మధ్యలో ప్రభుత్వాలను చాలా సమర్థవంతంగా నడపాల్సి ఉంటుందన్నారు. రెండు రాష్ట్రప్రభుత్వాలకు ఈ తరహా ఇబ్బందులు కోకోల్లలు వున్నాయని అన్నారు. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీల పాలనను, ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరముందని చెప్పారు. దశాబ్దాల తరువాత తెలంగాణ వచ్చిందని, తానెప్పుడూ సునిశితంగా ఆలోచిస్తానని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తానని చెప్పారు. సమస్యలను సానుకూలంగా ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలో ఆలోచించాలని పవన్ అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిస్తే తప్పేంటీ.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను కలిస్తే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే విపక్షానికి చెందిన పార్టీలు ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నాయని అన్నారు. ఈ అంశంలో రచ్చ ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రజలు ఓటుతో తీర్పునిచ్చే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పని చేయనని, విమర్శలు చేస్తూ రాజకీయాలను అస్థిరపర్చే ఉద్దేశం తనకు లేదని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  press meet  press conference  karimnagar  TRS party  telangana  politics  

Other Articles