Ego makes PM snub me: Anna ‘‘ఏమిటీ ఈ నిర్లప్తత’.?’ ప్రధానిపై అన్నాహజారే ఫైర్

Narendra modi has an ego of his prime ministership alleges anna hazare

Anna Hazare Narendra Modi, Anna Hazare movement, hazare modi, hazare letters to modi, Anna hazare, PM Modi, letters, anti corruption crusader, aravind kejriwal, agitation, new delhi, maharastra

"I have written more than 30 letters to PM Modi in the last three years, but he never replied to them. Modi has an ego of his prime ministership," Mr Hazare claimed.

‘‘ఏమిటీ ఈ నిర్లప్తత’.?’ ప్రధానిపై అన్నాహజారే ఫైర్

Posted: 01/22/2018 10:08 AM IST
Narendra modi has an ego of his prime ministership alleges anna hazare

అవినీతి వ్యతిరేక ప్రభుత్వం అధికరాంలోకి వచ్చింది.. ఇక దేశ ప్రజలు ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తమ పనులు జరుపుకోవచ్చునని.. ఇలాంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలోనూ కావాలంటే మీరు బీజేపి పార్టీకే ఓటువేయాలని పదే పదే పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. అదే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే విషయంలో మాత్రం స్పందించడమే మానేశాడు. దేశీయ వ్యవస్థలో అనినీతి పేరుకుపోయిందంటూ ఉద్యమించిన అన్నాకు ప్రధాని నుంచి అదరణ కూడా కరువైంది.

ఎక్కడో దేశంలోని ఏ మారుమూల నుంచో చిన్నారులు తనకు లేఖలు రాస్తే వాటిపై స్పందించే ప్రధాని నరేంద్రమోడీ వారు అభ్యర్థించిన అంశాలను యుద్దప్రాతిపదికన అమలయ్యేలా చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రధానులు రావాలి, కావాలి అని యావత్ భారతం కోడై కూసి.. నెట జనుల ప్రశంసలను అందుకున్నారు. అయితే కేరళ నుంచి ఓ పదో తరగతి విద్యార్థిని ప్రధానికి మాదకద్రవ్యాలను దేశంలో నిషేధించాలని కోరిన తరుణంలో మాత్రం రెండేళ్లు గడుస్తున్నా స్పందన లేదు. ఈ విద్యార్థిని విషయాన్ని పక్కనబెడితే సామాజిక కార్యకర్త అన్నాహజారే అంశంలోనూ ప్రధాని అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఈ మేరకు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై అన్నా తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నరేంద్రమోడీలో తాను ప్రధానమంత్రి అన్న అహంభావం పేరుకుపోయిందని మండిపడ్డారు. దేశీయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతుందని, దానిని అరకట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తాను గత మూడేళ్ల నుంచి మోదీకి 30కి పైగా లేఖలు రాశానని... అయినా ఒక్క లేఖకు కూడా ఆయన బదులు ఇవ్వలేదని అన్నారు. తాను 'ప్రధానిని' అనే అహంకారం ఆయనలో నరనరాన జీర్ణించుకుపోయిందని విమర్శించారు.

తాను సామాజిక కార్యకర్త లేఖలు ఎందుకు బదులివ్యాలన్న ధోరణి, అహంకారం వల్లే నరేంద్రమోడీ తన లేఖలకు స్పందించలేదని అన్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్ పడీలో ప్రజల మద్దతు కోసం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, మార్చి 23 నుంచి మరోమారు దేశ రాజధాని న్యూఢిల్లీలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పాటు రైతు మద్దతుగా నిరసనను తెలియజేస్తామని అన్నారు. ఇలాంటి ప్రజాఉద్యమం ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలా వుంటుందని అన్నారు. అయితే తన ఉద్యమాల నుంచి మరో అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పుట్టుకురాడని కూడా అన్నాహజారే ఇదివరకే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna hazare  PM Modi  letters  anti corruption crusader  aravind kejriwal  agitation  new delhi  maharastra  

Other Articles