touch not woman without their consent says court మహిళలను తాకడంపై ఢిల్లీ న్యాయస్థానం సంచలన తీర్పు..

Woman s body is her own no one can touch her without consent court

Chavi Ram, Delhi Court, womans body is her own, minor assaulted, molest on minors, nine years girl, Judge Seema Maini, sexual assault, molestation, delhi

A Delhi court while sentencing a man for trying to molest a little girl said a woman's body is her own and it is she who has an exclusive right over it and all others are prohibited to touch her.

మహిళలను తాకడంపై ఢిల్లీ న్యాయస్థానం సంచలన తీర్పు..

Posted: 01/22/2018 10:52 AM IST
Woman s body is her own no one can touch her without consent court

మహిళలను గౌరవించే సభ్యసమాజం మనది. అంతేకాదు వారిని పూజించే ఫుణ్యభూమి కూడా మనదే. దానిని యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతి దేవతాక అన్న సంస్కృత శ్లోకం కూడా ఘోషిస్తుంది. భార్యను కాళికాదేవి రూపంగా కొలిచిన కాళీదాసు కన్నా ముందునుంచే ఈ సద్సంప్రదాయం కొనసాగుతంది. ఈ నేపథ్యంలో మహిళ శరీరాలకు సంబంధించి ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మహిళల దేహాలు వారి సోంతమని తేల్చిచెప్పింది. వారి శరీరంపై ఆమెకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదని న్యాయస్థానం తీర్పును వెలువరించే క్రమంలో వెల్లడించింది. 2014లో ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో తొమ్మిదేళ్ల బాలికపై అసభ్య రీతిలో ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్ వాసి చెవి రామ్ కేసును విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

చెవి రామ్ వ్యవహరించిన తీరు లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించింది. జరిమానాలో రూ. 5 వేలు బాలికకు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా బాలికకు రూ. 50 వేలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని... దీన్ని పురుషులు కాలరాస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles