jilted lover murders young girl in hyderabad పెళ్లికి నిరాకరించిందని దారుణహత్య

Hyderabad girl rejects marriage proposal jilted lover stabs her to death

Hyderabad, jilted lover, stabbed, stabbed to death, girl stabbed to death, marriage proposal, rejected marriage proposal, Moosapet, arrested, Janki, Anand, harass, roommate, police, dmart, jilted lover, murder, colleague, hyderabad, crime

Rejecting a marriage proposal proved fatal for a 24-year-old girl in Hyderabad who was stabbed to death allegedly by the jilted lover.

ప్రేమోన్మాది ఘాతుకం: పెళ్లికి నిరాకరించిందని దారుణహత్య

Posted: 01/10/2018 11:48 AM IST
Hyderabad girl rejects marriage proposal jilted lover stabs her to death

హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కూకట్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో క్రితం రోజు అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యసవలస గ్రామానికి చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్ లో తన స్నేహితురాలు రూపతో కలసి అద్దెఇంట్లో నివాసముంటూ.. కూకట్ పల్లిలోని డీమార్ట్ లో పనిచేస్తోంది.

అదే సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలంలోని మారెపల్లి గ్రామానికి చెందిన అనంతప్ప అలియాస్ ఆనంద్ గత కొద్దికాలంగా తనను ప్రేమించాలంటూ జానకిని వేధించేవాడు. అయితే అతడి ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో 10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. అయితే అతడి హెచ్చరికలను జానకి తేలిగ్గా తీసుకుంది.

కాగా, క్రితం రోజు రాత్రి రూప ఇంటికి చేరుకునే సరికి జానకి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుతోంది. ఆమెను కడుపులో కత్తితో బలంగా పోడిచిన గాయాలున్నాయి. దీంతో స్థానికులు జానకిని సమీపంలోని ప్రైవేటు అస్పత్రికి తరలించినా.. పరిస్థితి విషమించడంతో అక్కడే చికిత్స చేస్తుండగా మరణించింది. నిందితుడు ఆనంద్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dmart  jilted lover  murder  marriage proposal  colleague  hyderabad  crime  

Other Articles