fake notes video goes viral on social media కొత్త నోట్ల కట్టలను చూసి మురిసిపోతున్న జనం.. వీడియో వైరల్..

Fake notes video goes viral on social media

social media, viral video, video viral, currency notes, Rs 50 notes, Rs 200 notes, whatsapp, facebook, twitter, fake currency notes, children bank, reserve bank of india, urjit patel, new note printing press

A video doing rounds in social media, which resembles Rs 2,000, Rs 200 and Rs 50 denominations of Indian currency notes being stashed, claims to be from a factory in Bangladesh.

ITEMVIDEOS: కొత్త నోట్ల కట్టలను చూసి మురిసిపోతున్న జనం.. వీడియో వైరల్..

Posted: 01/10/2018 12:54 PM IST
Fake notes video goes viral on social media

డబ్బు ఎవరికి చేదు అన్న చందంగా కట్టల కట్టల డబ్బు కనిపిస్తే.. ఎవరు మాత్రం చూడకుండా వుంటారు. ఎలాగో అంత డబ్బును అర్జించే అవకాశం లేదు. అవకాశమున్నా అంత డబ్బును అలా ఎప్పుడూ చూడలేము. ఇక దీంతో అలా కట్టల కట్టల డబ్బు కనిపించేసరికి అ వీడియోనూ చూస్తూ నెట్ జనులు మురిసిపోవడంతో.. ఆ వీడియో కాస్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోలో అప్పుడే ప్రింటింగ్ పూర్తి చేసుకొని కట్టలు కట్టలుగా పేర్చిన కొత్త నోట్లను గుట్టలు గుట్టలుగా ఓ వ్యక్తి పేరుస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఇవి ఒరిజినల్ నోట్లేనా.. లేక దొంగనోట్లా..? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఎన్ఎన్ పిపిలో మాత్రమే ప్రింట్ చేసే నోట్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రింట్ చేస్తారు. ఇక్కడ వీడియో తీసే అవకాశమే ఉండదని, అయితే ఓ వ్యక్తి ఏకంగా కొత్త నోట్లను పేరుస్తూ వీడియోకు ఫోజునివ్వడం అనుమానాలకు తావిస్తుంది.  

పాత పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం అనుమతితో రిజర్వబ్యాంకు అప్ ఇండియా అమోదంతో కొత్తగా చెలమాణిలోకి వచ్చిన రూ. 50, 200, 500, 2000 నోట్లను ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీడియోలో కనిపిస్తున్న ఈ నోట్లు అచ్చిందా కొత్తగా తీసుకువచ్చిన రూ.50, రూ.200 ల మాదిరిగా వుండటంతో అది కాస్తా వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటికీ తగిన సంఖ్యలో రూ.50, రూ.200 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో..అవే నోట్లను వీడియోలోని వ్యక్తం పేరుస్తుడంటం కూడా అనుమానాలకు తావిస్తుంది.

కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తే ఈ నోట్లు ఒరిజినల్ కావని చెప్పవచ్చు. అదెలా అంటే.. సాధారణంగా నోట్ల పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. అయితే వీడియోలో చూపించిన నోట్లలో మాత్రం భారతీయ చిల్డ్రన్ బ్యాంక్ అని రాసి ఉంది. అంటే వీడియోలో చూపించింది చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే నోట్ల ఫ్యాక్టరీ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు  చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే మరీ అంత పెద్ద ఫ్యాక్టరీలో ప్రింట్ చేస్తారా,  కాదు కాదు.. అవి దొంగనోట్లు తయారు చేసే ఫ్యాక్టరీనే అంటూ వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social media  viral video  currency notes  whatsapp  fake currency notes  children bank  reserve bank  

Other Articles