locals greet BJP candidate with garland of shoes బీజేపి నేత మెడలో చెప్పులదండ

Bjp leader offered a garland of shoes during election campaign

Dinesh Sharma, garland of shoes, Bharatiya Janata Party, BJP, Dhar, Dhamnod, garland of shoes, Madhya Pradesh, Madhya Pradesh civic elections, Civic Polls in Madhya Pradesh, MP, civic polls, national news

Frustrated over water problem, angry locals welcomed a BJP candidate Dinesh Sharma, who was campaigning for the forthcoming civic elections, with a garland of shoes and was made to wear it.

మెడలో చెప్పులదండతో బీజేపి నేతకు స్వాగతం..

Posted: 01/08/2018 01:04 PM IST
Bjp leader offered a garland of shoes during election campaign

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయితే ప్రజాగ్రహం పెల్లుబిక్కుతుంది. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలు కూడా తాము ఎన్నుకున్న నేతను సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నపాలు చేశారు. అయితే వాటిని పట్టించుకోని పాలకపక్షం వారిపై ఉక్కుపాదం మోపింది. దీంతో అప్పటి పరాభవాన్ని గుర్తుపెట్టుకున్ని అక్కడి ఓటర్లు.. సమయం, సందర్భంగా వచ్చేవరకు వేచిచూసి.. అదనుదొరకగానే తాము ఎన్నుకున్న నేత మొడలో చెప్పుల దండ వేసి మరీ స్వాగతం పలికారు.

ఐదేళ్లు గడించింది. తమ సమస్యలను పట్టించుకున్న నాధుడే లేడు. దీంతో తామే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఓ ప్రాంత ప్రజలకు పరాభవం ఎదురైంది. అయితే సరిగ్గా సమయం రానేవచ్చింది. త్వరలో మధ్యప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. గెలుపు కోసం అధికార, విపక్ష పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో అన్నిపక్షాలకు చెందిన నేతలు తమ వార్డుల్లో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇలా కోసం ప్రచారానికి వెళ్లిన బీజేపి నేతకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికులు ఆయన మెడలో చెప్పుల దండ వేసి అవమానించారు. మధ్యప్రదేశ్ లోని ధార్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దినేశ్‌ శర్మ అనే నేత ధార్ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు. ధామ్నోద్‌ ప్రాంతంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లగా ఆయన మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేశారు. ఓ వ్యక్తి చెప్పుల దండ తీసుకుని వస్తుండగా దినేశ్‌ శర్మ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారని వార్తలు రాగా, అతని మెడలో చెప్పులదండలు వేసినట్లు వీడియోలో కనిపించింది.

ఇక ఈ ఘటనపై స్పందించిన బిజేపి అబ్యర్థి దినేశ్ శర్మ‘నా వల్ల అతనికి ఏదో అసంతృప్తి కలిగి ఉంటుంది.. అందుకే ఇలా ప్రవర్తించి ఉంటారు. నేను వాళ్ల బిడ్డ లాంటి వాడిని. అన్ని విషయాలు కూర్చుని చర్చిద్దా’మని దినేశ్‌ ఆ ఘటన అనంతరం అన్నారు. తమ ప్రాంతంలో తీవ్రంగా ఉన్న నీటి సమస్యను ఎత్తిచూపేందుకు ఇలా చేసినట్లు చెప్పుల దండ వేసిన వ్యక్తి వెల్లడించారు. తమ ప్రాంతంలోని మహిళలు గతంలో ఉన్న ఛైర్మన్‌కు నీటి సమస్యపై ఫిర్యాదు చేశారని, కానీ మహిళలపై ఫిర్యాదు నమోదు చేసి ఇబ్బందిపెట్టారని అందుకే ఇలా చేశానని ఓ మీడియాకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dinesh Sharma  garland of shoes  Dhar  Dhamnod  Madhya Pradesh  

Other Articles