woman’s leg is cut off by faulty lift భద్రం బిడ్డో.. ఎక్కుడుకాడ.. దిగుడుకాడ ఫైలం బిడ్డో..

Horrific incident woman s leg is cut off by faulty lift

china women leg cut off, lift china woman, faulty lift, china woman trapped in lift, china woman mobile phone, viral and trending, woman, china, elevator, legs amputated, accident, horrific, Conch Building, Zhongshan, West Road of Shanghai

Horrific moment woman’s leg is cut off by faulty lift after she gets trapped by doors ‘while looking at her phone’ CCTV footage from inside the lift shows the woman and a pal looking at their phones as they walk towards the open doors.

ITEMVIDEOS: భద్రం బిడ్డో.. ఎక్కుడుకాడ.. దిగుడుకాడ ఫైలం బిడ్డో..

Posted: 01/03/2018 04:04 PM IST
Horrific incident woman s leg is cut off by faulty lift

స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా చిత్రమైంది. అవి ఎంత మేరకు మేలు చేస్తాయో అంతే అనర్థాలకు కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేక రోడ్డు దాటుతున్నప్పుడు.. లేదా ప్రాణాలకు ముప్పు పోంచివున్న ప్రాంతాల్లో మోబైల్ ఫోన్లను కేవలం వస్తువులా పట్టుకోవాల్సిందే కానీ, వాటిపై ద్యాస పోతే.. ప్రమాదాలకు గురవుతారన్నది కాదనలేని వాస్తవం. పొన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతూ కొందరు, స్మార్ట్ పోన్ లో దృష్టినంతా కేంద్రీకరించి రైలు పట్టాలు దాటుతూ మరికొందరు అసువులు బాసిన ఘటనలు మనకు తెలిసిందే.

ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని, ఏ మాత్రం నిర్లక్ష్యమైనా ప్రాణాలను హరించివేస్తుందని తెలిసినా.. అంతా సవ్యంగానే సాగుతుందన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా మోబైల్ ఫోన్లో వ ను చూస్తూ న‌డుస్తోన్న ఓ యువ‌తి ప్ర‌మాదానికి గురైన‌ ఘ‌ట‌న చైనాలోని షాంఘై పట్టణానికి పశ్చిమ రోడ్డులో వున్న జాంగ్షాన్ నగరంలోని కోంచ్ భవనంలో ఈ భీతావాహ ఘటన చోటు చేసుకుంది. నిజానికి ఇది ప్రమాదవశాత్తు జరిగినా.. అందులో కొంత నిర్లక్ష్యం మాత్రం యవతిది వుందన్న విషయం సిసిటీవీ ఫూటేజీ చెప్పకనే చెప్పేస్తుంది.

స్థానికంగా గల ఒక ప్రయివేటు కంపెనీలో ఆ యువ‌తి ప‌నిచేస్తోంది. త‌న ప‌ని ముగించుకున్నాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌ దగ్గరకు వచ్చింది. అదే స‌మ‌యంలో స్మార్ట్ పోన్ ను చూస్తూ లిఫ్టులో అడుగుపెట్టింది. లిప్టులోని ప్రవేశించేందుకు ఏర్పాటు చేసే డోర్ పిట్ అయ్యేందుకు వున్న చిన్నపాటి పట్టీలు తగిలి అమె లిప్టులో పడిపోయింది. ఈ క్ర‌మంలో ఆమె కాలు.. రెండు లిఫ్టు డోర్ల మ‌ధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో అమె వెనకనున్న మరో యువతి అమెను రక్షించేందుకు తన చేతిని అడ్డుగాపెట్టబోయింది. అయితే లిప్టు డోర్ పడతుంటంతో అమె వదిలేసింది.

అయితే మనిషి కాలు డోర్ కు అడ్డుగా పడినా.. లిప్టు డోర్లు లాక్ కాకపోయినా.. లిప్టు మాత్రం వేగంగా పైకి వెళ్లింది. ఇలా రెండు ఫ్లోర్లు కదిలిని తరువాత యువతి మరో కాలి సాయంతో బయట డోర్ కు అడ్డంగా పెట్టింది. అయితే అప్పటికే యువతి కాలు ఛిద్రమైపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. స్మార్ట్ ఫోన్లు చూస్తూ న‌డుస్తూ చాలా మంది ప్ర‌మాదాల‌కు గుర‌వుతోన్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్న‌ాయి.. స్మార్ట్ ఫోన్ ప్రియులు తస్మాత్ జాగ్రత్తా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral and trending  woman  china  elevator  legs amputated  accident  horrific  

Other Articles