Two held for assault two Hindu girls హిందూ అమ్మాయిలపై భజరంగ్ ధళ్ కార్యకర్తల దాడి

Bajrang dal activists assault two hindu girls for mixing with muslim boys

bajrang dal, hindu girls, muslim boys, Ramalinga Reddy, Bengaluru, Mangaluru, crime, home minister, Right-wing activists, Pilikula Park, karnataka

Two members of Bajrang Dal, a right-wing Hindu outfit were arrested for assaulting two teenage girls for allegedly interacting with Muslim youths

ITEMVIDEOS: హిందూ అమ్మాయిలపై భజరంగ్ ధళ్ కార్యకర్తల దాడి

Posted: 01/03/2018 12:37 PM IST
Bajrang dal activists assault two hindu girls for mixing with muslim boys

మోరల్ పోలిసింగ్ పేరుతో అరెస్సెస్ అనుబంధ సంస్థలు దేశంలో చేస్తున్న దాడులు పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికలు వున్న రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. దాడులు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి.. ప్రజల మధ్య విభేదాలను తీసుకువచ్చేందుకు కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఇదివరకు ఎప్పుడూ భారతావని చవచూడని ఘటనలు అందోళన రేపుతున్నాయి.

కేరళలో ఇలాంటి ఘటనలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి కిప్ అఫ్ లవ్ అనే వ్యతిరేక ఉద్యమాన్ని కూడా అచరణలోకి తీసుకువచ్చారు. అలాంటి మోరల్ పోలిసింగ్ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కూడా వున్నాయి. ఇక తాజాగా దక్షిణ కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముస్లిం యువకులతో కలసి పార్కుకు వచ్చారన్న అభియోగాలపై ఇద్దరు కాలేజీ అమ్మాయిలను అడ్డుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు అమ్మాయిలపై ఏకంగా పోలీసులు సమక్షంలోనే దాడి చేసిన ఘటన మంగళూరులో కలకలం రేపింది.

మంగళూరుకు సమీపంలో ఉండే తాలిపాడి యూనివర్శిటీలో ఇధ్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. వీరిద్దరూ మరో ఇద్దరు ముస్లిం యువకులతో కలసి ఉండగా... వారిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. చివరకు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో, ఇద్దరు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ టీఆర్ సురేష్ తెలిపారు.  

ఇక ఇలాంటి మోరల్ పోలిసింగ్ పేరుతో హిందుత్వ శక్తులు రెచ్చిపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కర్ణాటక హోంశాఖ మంత్రి రామలింగారె్డ్డి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసుల సమక్షంలో కూడా అమ్మాయిలపై దాడి చేయడంపై వచ్చిన  వార్తల నేపథ్యంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్వవహరించిన పోలీసులపై కూడా చర్యలు తప్పవని చెప్పారు. అయితే దక్షిణ కర్ణాటకకు చెందిన కోస్తా ప్రాంతమైన మంగళూరులో ఇలాంటి అనేక ఘటనలు గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటూనే వున్నాయనిని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bajrang dal  hindu girls  muslim boys  Ramalinga Reddy  Bengaluru  Mangaluru  crime  

Other Articles