Helicopter Service for Sammakka Saralamma Jatara | మేడారం కోసం హెలికాఫ్టర్ సర్వీసులు కూడా రెడీ

Helicopter service for medaram jatara

Medaram Jatara, Sammakka Saralamma Jatara, Helicopter Services, Telangana Government, Allola Indrakaran Reddy, Vice President Venkaiah Naidu,

For the first time the helicopter services has been started for sammakka saralamma jatara in Medaram,jatara will starts from 31 January to 3 February 2018.The rides to Medaram will be operated from Begumpet in Hyderabad and Arts College Grounds in Warangal. The aviation company will use one of the two helipads available near Medaram. Vice President and Union Ministers Invited for Medaram Jatara

మేడారం కోసం హెలికాఫ్టర్ సర్వీస్

Posted: 01/03/2018 03:45 PM IST
Helicopter service for medaram jatara

మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచేసిన ప్రభుత్వం.. హస్తినలో ఆహ్వానాలు పంచుతోంది.

కేంద్ర మంత్రులతోపాటు మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందించింది. అలాగే, జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన ఢిల్లీలో మీడియాకు తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు బేగంపేట్,  వరంగల్ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఆపరేట్ కానున్నాయి. మేడారం దగ్గర రెండు, లక్నవరం దగ్గర ఒక హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయనున్నారు.  

ఇక ఈ నెల 21వ తేదీ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతుంది. వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం నుంచి రూ. 80 కోట్లను కేటాయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles