Venkaiah Naidu too duped by weight-loss pill ad నకిలీ ప్రకటనలకు మోసపోయిన వెంకయ్య

Was duped by weight loss pill ad says venkaiah naidu

Venkaiah Naidu, weight loss, weight loss ad, weight loss pills, fake advertisement, Rajya Sabha

"Soon after becoming the vice president, I came across an advertisement for a medication which promised to help lose weight in 28 days. I talked to a few people. But they said this was not true.

అమెరికా ఫ్రాడ్ కంపెనీ చేతిలో మోసపోయిన వెంకయ్య

Posted: 12/30/2017 10:18 AM IST
Was duped by weight loss pill ad says venkaiah naidu

అమెరికాలోని ఫ్రాడ్ కంపెనీలు ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా మోసం చేశాయి. వాటి విపరీత ప్రకటనలను నమ్మిన ఆయన తన చేతి చమురును కూడా వదిలించుకున్నారు. అర్డర్ చేసిన వస్తువు బదులు ఈమెయిల్ రావడం.. మరికొంత సొమ్ము ఇస్తే అంటూ సారాంశం వుండటంతో అయన ఏకంగా కేంద్ర మంత్రికి పిర్యాదు చేస్తే విచారించిన తరువాత తెలిసిన విషయమేంటంటే తాను  మోసపోయానని. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా రాజ్యసభలో తెలిపారు.

బ‌రువు త‌గ్గాలంటే ఇది వాడండి.. ఇంత డ‌బ్బులు క‌ట్టండి.. అంటూ వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా మోస‌పోయార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించారు. స‌మావేశంలో భాగంగా స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ న‌రేశ్ అగ‌ర్వాల్ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న న‌కిలీ ప్ర‌క‌ట‌న‌ల అంశాన్ని చ‌ర్చ‌కు లేవ‌నెత్తారు. ఈ అంశం చ‌ర్చ‌లో భాగంగా రాజ్య‌స‌భ చైర్మ‌న్ క‌ల‌గ‌జేసుకుని త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను పంచుకున్నారు.

"ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో చేరిన త‌ర్వాత, బ‌రువు త‌గ్గాలంటే త‌మ మందులు వాడాలంటూ వచ్చిన ఓ ప్ర‌క‌ట‌న చూశాను. వారిని సంప్ర‌దిస్తే వెయ్యి రూపాయ‌లు చెల్లించ‌మ‌న్నారు. అలాగే అని చెల్లించాను. త‌ర్వాత మ‌ళ్లీ వారి నుంచి ఓ మెయిల్ వచ్చింది. మొదటి మందుతో పాటు మరో టాబ్లెట్ కూడా వాడాలని, దానికి మ‌రో వెయ్యి చెల్లించాల‌ని, అలా చెల్లిస్తేనే మొదటి మందుతో పాటు రెండో మందు కూడా పంపుతామని పేర్కొన్నారు.

దాంతో నాకు అనుమానం వ‌చ్చి వినియోగ‌దారుల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ఫిర్యాదు చేశాను. ఆయ‌న విచారించి ఆ ప్ర‌క‌ట‌న న‌కిలీద‌ని, అది ఇచ్చిన కంపెనీ అమెరికాకు చెందిన‌ద‌ని చెప్పారు' అని వెంక‌య్య నాయుడు వివ‌రించారు. ఇలాంటి ప్ర‌క‌ట‌నల‌పై ఏదైనా చ‌ర్య తీసుకోవాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌గా... స‌భ‌లో ఉన్న పాశ్వాన్.. అందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles