Indian student shot dead by armed robbers in Chicago సాయుధ దొంగల చేతిలో భారత విద్యార్థి హతం

Indian student shot dead by armed robbers in chicago

indian student shot in chicago, chicago gun violence, Arshad Vhora killed in chicago, Arshad Vhora news, indian student, armed robbers, US, America, Chicago, crime

An Indian-origin student Arshad Vhora, 19, was shot dead during an attempted armed robbery in the U.S., becoming one of the latest victims of gun violence in the country.

అమెరికాలో ఘోరం: సాయుధ దొంగల చేతిలో భారత విద్యార్థి హత్య

Posted: 12/30/2017 09:27 AM IST
Indian student shot dead by armed robbers in chicago

అమెరికాలో మరో దారుణం జరిగింది. తన ఉన్నత చదువులపై కోటి అశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారత సంతతి విద్యార్థిని అక్కిడి సాయుధ దోపిడి దొంగలు కాల్చిచంపారు. ఈ ఘటనలో మరో భారత విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గుర్తుతెలియని దోంగలు ఘటన జరిగిన క్షణాల్లో ఘటనాస్థం నుంచి పరారయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. భారత దేశానికి చెందిన అర్షద్‌ వోహ్రా(19) తన ఉన్నత విద్యను అభ్యసించేందుకు అగ్రరాజ్య అమెరికాకు వెళ్లాడు. అయితే చదువుతో పాటు అక్కడి ఖర్చును కూడా సంపాదించేందకు పార్ట్ టైం గా స్థానికంగా వుండు గ్యాస్ స్టేషన్ లో పనికి కుదిరాడు. కాగా, షికాగోలోని డాల్టన్‌ పరిధిలోని క్లార్క్‌ స్టోర్ ప్రాంతంలో ఉన్న ఓ గ్యాస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్న వోహ్రాను, దొంగతనం చేసేందుకు అక్కడికి వచ్చిన సాయుధ దొంగలు హచ్చరికలకు వోహ్రా లొంగలేదు. దీంతో అతన్ని కాల్చిచంపి డబ్బుతో సాయుద దొంగలు పరారయ్యారు.

వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వోహ్రా స్నేహితుడు, హైదరాబాద్ కు చెందిన బకర్‌ సయీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వోహ్రా తన తండ్రికి బదులుగా గ్యాస్‌ స్టేషన్‌ లో పని చేసేందుకు వచ్చాడని, నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 12వేల డాలర్ల రివార్డును అందజేస్తామని పోలీసులు తెలిపారు. గాయపడిన బకర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian student  armed robbers  US  America  Chicago  arshad vohra  crime  

Other Articles