Sushma Swaraj blocks MP Bajwa on Twitter సుష్మాస్వరాజ్ పై కాంగ్రెస్ ఎంపీ అసహనం..

Sushma swaraj blocks fellow parliamentarian and congress mp bajwa on twitter

Sushma Swaraj,Punjab,sushma swaraj twitter,singh bajwa bajwa,Congress MP,Congress

Should a minister, holding a public office, block people on social media? Questions were raised by internet users after external affairs minister Sushma Swaraj blocked Congress MP from Punjab, Pratap Singh Bajwa

వివరాలు చెప్పమంటే ఖాతా బ్లాక్ చేసిన సుష్మాస్వరాజ్

Posted: 12/29/2017 05:43 PM IST
Sushma swaraj blocks fellow parliamentarian and congress mp bajwa on twitter

పార్లమెంటు సాక్షిగా అబద్దపు ప్రకటనలు చేయడంపై నిలదీసిన రాజ్యసభ సభ్యుడికి అవమానం ఎదురైంది. ఏకంగా చట్టసభలో తప్పుడు ప్రకటనలు చేసి.. పబ్బం గడుపుకోవాలని యత్నించిన కేంద్రమంత్రి చేతిలోనే ఆయనకు ఈ పరాభవం ఎదురైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చివరాఖరకు దాయాధి పాకిస్థాన్ వాసుల చేత కూడా శభాష్ అనిపించుకున్న ఈ కేంద్రమంత్రి ఎవరో కాదు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్.

దీనిపై అయన ఏకంగా రాజ్యసభలోనే సుష్మాస్వరాజ్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర విదేశీవ్యవహరాల శాఖను అమె తన సోంత కార్యాలయంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భారతీయుల అచూకీపై బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్న తన పట్ల కేంద్రమంత్రి చర్యలను ఆయన తప్పబట్టారు. ఇరాక్ లో త‌ప్పిపోయిన 39 మంది భార‌తీయుల గురించి ప్రశ్నించి.. వారి వివరాలే ఏమైనా తెలిసాయా.? అంటూ అడుగుతుంలూ కేంద్రమంత్రి తన అకౌంట్ ను బ్లాక్ చేశారని ఇదెక్కడి చోద్యమని ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.  

అయితే ఇదే అంశంపై మాటిమాటికి అడుగుతున్న కార‌ణంగా ట్విట్ట‌ర్‌లో కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వా ఖాతాను, విదేశాంగ‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ బ్లాక్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ప్ర‌తాప్ సింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏకంగా రాజ్యసభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. 'విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలాగేనా ప‌ని చేసేది? త‌ప్పిపోయిన భార‌తీయుల గురించి అడిగినందుకు ఒక పార్ల‌మెంటు స‌భ్యుడిని ఇలా బ్లాక్ చేస్తారా?' అంటూ ప్ర‌తాప్ మండిప‌డ్డారు.

వీరిద్ద‌రి మ‌ధ్య వైరం జులైలో ప్రారంభ‌మైంది. ఇరాక్‌లో 39 మంది భార‌తీయులు త‌ప్పిపోయార‌ని సుష్మా స్వ‌రాజ్ లోక్‌స‌భ‌లో ప్ర‌క‌టించ‌గానే ప్ర‌తాప్ బ‌జ్వా ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. త‌ప్పిపోయిన‌వారి ఆచూకీ గురించి చెప్పడంలో సుష్మా వాస్తవాలు చెప్పడం లేదని విమ‌ర్శ‌లు చేశారు. ఇక అప్ప‌టినుంచి వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఆ భార‌తీయుల గురించి అడుగుతూనే ఉన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Punjab  sushma swaraj twitter  singh bajwa bajwa  Congress MP  Congress  

Other Articles