Vijay Sai's Wife Vanita surrendered పోలీసుల ఎదుట లొంగిపోయిన విజయ్ సాయి భార్య వనితా రెడ్డి

Tollywood comedian vijay sai s wife vanita reddy surrendered

tollywood comedian vijay sai, comedian vijay sai, vanita, vanita absconding, shashidar, lawyer srinivas, tollywood vijay sai, tollywood comedian vijay, comedian vijay, ammayelu abbayelu, vijay, comedian vijay sai, vijay death, comedian vijay sai death

After jubilee hills police notices to attend for investigation in her husband, tollywood familiar comedian vijay sai suicide case, vanita reddy surrenders to police after 16 days.

భర్త చనిపోయిన 16 రోజుల తరువాత లొంగిపోయిన వనితారెడ్డి

Posted: 12/27/2017 02:23 PM IST
Tollywood comedian vijay sai s wife vanita reddy surrendered

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ సాయి భార్య వనితారెడ్డి ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భర్త మరణించిన అనంతరం అయన తీసుకున్న సెల్పీ వీడియోలతో పాటు.. అంతకుముందు అమె రౌడీలను తీసుకువచ్చి.., తన కారును బలవంతంగా తీసుకెళ్లిందని కూడా, ఈ క్రమంలో తనపై దాడి చేశారని కూడా విజయ్ సాయి పోలీసులకు పిర్యాదులోనూ పేర్కోన్నారు. ఈ అధారాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు విజయ్ సాయి భార్య వనితారెడ్డిని తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

దీంతో పోలీసుల ఎదుట హాజరుకావాల్సిన అమె అదృశ్యమైంది. దాదాపుగా 16 రోజుల తరువాత అమె ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోగా, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తన భార్య కారణంగానే తాను మనోవేధనను అనుభవిస్తున్నానని, అందుచేతనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని కూడా విజయ్ సాయి అరోపించాడు. భరణం కోసం వనిత తనను వేధించినట్టు విజయ్‌ ఆరోపించిందని, తన కారును కూడా బలవంతంగా తీసుకెళ్లిందని కూడా అరోపించారు.

దీంతో వనిత సహా శశిధర్ అనే వ్యక్తితో పాటు అమె తరపు న్యాయవాది శ్రీనివాస్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్న వనిత.. తాజాగా పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆధారాలు, సాక్ష్యాలను సేకరించడంలో తనకు సమయం పట్టిందని, వాటిని తాజాగా పోలీసులకు సమర్పించబోతున్నట్టు అమె అంతకుముందు మీడియాకు తెలిపింది. పోలీసులు సరెండర్‌ కావాలని నోటీసులు ఇచ్చారని, అందుకే తాను పోలీస్‌ స్టేషన్ కు వచ్చినట్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  comedian  vijay sai  vanita reddy  suicide  shashidar  srinivas  crime  

Other Articles