L&T Metro Rail bags ABCI award అవార్డు వరించింది కానీ.. ప్రయాణికులకు తప్పని చిక్కులు

Hyderabad metro rail shocks passengers and vice versa

hyderabad metro rail, narendra modi, city passengers, metro passengers shocked, passengers shock metro rail, hyderabad, metro rail, passengers, traffic, L&T metro, award, telangana

There may not be a marked difference in traffic snarls in the city with the launch of Metro, but the 30-km Hyderabad Metro Rail has indeed been a hit with people with more than 1 lakh commuters using it as their daily mode of transport.

అవార్డు వరించింది కానీ.. ప్రయాణికులకు తప్పని చిక్కులు

Posted: 12/27/2017 03:11 PM IST
Hyderabad metro rail shocks passengers and vice versa

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన అవార్డు అందింది. వెబ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలో అన్ లైన్ లో విస్తృత ప్రచారానికిగాను ఎల్ అండ్ టీ కీ ప్రఖ్యాత అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా(ఏబీసీఐ) జాతీయ అవార్డు అందించింది. అవార్డును ఏబీసీఐ ప్రెసిడెంట్, వరల్డ్ కమ్యూనికేషన్స్ ఫోరం ఛైర్మన్ యోగేష్ జోషి చేతుల మీదుగా ఎల్‌అండ్‌టీ పీఆర్ మేనేజర్ జీవీఎన్‌ఎస్ నరేంద్రనాథ్ అవార్డును అందుకున్నారు. పీఆర్ బ్రాండింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు హైదరాబాద్ మెట్రోరైలును అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం 1900 ఎంట్రీలు రాగా అందులోనుంచి హైదరాబాద్ మెట్రోరైలు ఎంపిక చేశారు. ఇది నాణేనికి ఒకవైపు.

మరి నాణేనికి రెండో వైపు మాత్రం ఏ ఉద్యేశ్యంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని మాత్రం అందుకోవడంలో విఫలమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మెట్రో రైల్ అగమనంతో రోజంతా చేయాల్సిన ప్రయాణాలు గంటల వ్యవధిలో ముగుస్తాయని భావించిన ప్రయాణికులకు షాక్ తగులుతుంది. నిర్ణీత సమయంలోగా మెట్రో రైళ్లు గమ్యస్థానం చేరడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణానికి కూడా రెట్టింపు సమయం పడుతోందని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా గమ్యస్థానం చేరాలనుకుంటున్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీని బదులు సిటీ బస్సులోనే, సొంత బైక్ మీదో వెళితేనే బాగుంటుందనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇక మెట్రో కూడా ఎంఎంటీఎస్ రైలు మాదిరిగా సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంపై ప్రయాణికులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బేగంపేట ప్రాంతంలో మెట్రో రైలు ఏకంగా 7 నిమిషాల పాటు ఆగిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఇక స్టేషన్ల వద్ద 20 సెకన్ల పాటు మాత్రమే అగాల్సిన మెట్రో.. నిమిషాల పాటు అగుతుందని కూడా ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

మరోవైపు, మెట్రోకు కూడా ప్రయాణికులు అదేస్థాయిలో షాకిస్తున్నారు. అదెలా అంటే.. మెట్రో రైలులో ప్రతీరోజు వేల మంది ప్రయాణాలు సాగిస్తున్నా వారిలో అధికంగా సరదగా వెళ్తున్నవారేనని స్పష్టమైంది. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రయాణిస్తున్నవారి సంఖ్య అత్యల్పమేనని తెలుస్తుంది. కార్యాలయాలకు, లేక తమ వ్యాపారాల కోసం మెట్రోను అశ్రయిస్తున్న వారి సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే వుందని సమాచారం. రోజువారి ప్రయాణికులు మెట్రోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మెట్రో యాజమాన్యానికి షాక్ కలిగిస్తుంది. సరదా తీరిపోయిన తర్వాత మెట్రో రైళ్లలో ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  metro rail  passengers  traffic  L&T metro  award  telangana  

Other Articles