viral video: Teacher gets massage from student ఆచార్యా.. విద్యార్థితో తరగతి గదిలో ఇదేం పని..?

Teacher gets massage from student in mp school video goes viral

caught on camera, teacher, student, back massage, Damoh, Madiyado, government school, Deepak Joshi, Madhya Pradesh, viral video, social media, video viral

A video of a government school teacher getting a massage from his student in Madhya Pradesh has gone viral, which said to have been shot inside a school in Damoh's Madhiyadoh, Madhya Pradesh and has gone viral on the social media.

ITEMVIDEOS: ఆచార్యా.. విద్యార్థితో తరగతి గదిలో ఇదేం పని..?

Posted: 12/22/2017 03:49 PM IST
Teacher gets massage from student in mp school video goes viral

భావితర పౌరులను సన్మార్గులుగా, ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులే.. తమ బాధ్యతలను, విధులను మర్చిపోయి తరగతి గదిలో తమ విద్యార్థుల చేత బాడీ మసాజ్ చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ అయింది.

దీంతో ఉపాద్యాయుడి వైఖరిపై కన్నెర్న చేసిన విద్యాశాఖ ఈ ఘటనపై స్పందించింది. విద్యార్థి చేత మసాజ్ చేయించుకుంటున్న ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు నేలపై పడుకుని, అతని వీపుపై విద్యార్థితో తొక్కించుకున్నాడు. తరగతి గదిలో విద్యార్థుల ముందే ఇలా చేశాడు.

ఈ వ్యవహారాన్నంతా ఎవరో వీడియో తీసి నెట్‌లో పెట్టారు. దీంతో ఈ మాస్టారు బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా షేర్ చేయడంతో వ్యవహారం విద్యా శాఖ వరకూ వెళ్లింది. మధ్యప్రదేశ్ విద్యాశాఖా మంత్రి దీపక్ జోషి ఘటనపై స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారికి ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఉపాధ్యాయుడిది తప్పని తేలితే సస్పెండ్ చేయాలని కూడా మంత్రి ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : school teacher  school  student  Massage  Madhya Pradesh  Damoh  caught on camera  viral video  

Other Articles